చింతపండు పచ్చడి (Tamarind Chutney)
|
|
కావలసిన పదార్థాలు: చింతపండు ------ నిమ్మకాయంత(నాన పెట్టుకోవాలి) ధనియాలు ---- 2 స్పూన్స్ మెంతులు ---- 1/2 స్పూన్ జీలకర్ర ----- 1 స్పూన్ ఎండు కొబ్బెర ----- 1/2 గరిట ఎండు మిరపకాయలు ----- 6 ఉప్పు -----తగినంత బెల్లం ---- చిన్న ముక్క ఇంగువ--- చిటికెడు తిరగమాత గింజలు --- (1/2 స్పూన్ అన్నీ)ఉద్దిపప్పు, శనగ పప్పు, ఆవాలు |
విధానము:
1.ముందుగా చింతపండు నాన పెట్టుకోవాలి.
2. బానలి లో 1/2 నూనె వేసి , 2 స్పూన్స్ ధనియాలు ,1/2 స్పూన్ మెంతులు , 1 స్పూన్ జీలకర్ర, ఎండు మిరపకాయలు 6 లేక 7 , ఇంగువ వేసి ,వేయించుకోవాలి .
3. వేయించినవి చల్లగా అయ్యాక, ఎండు కొబ్బెర 1/2 గరిట మిక్సీ వేసుకోవాలి.
4.తరువాత పీచు లేకుండా , చింతపండు గుజ్జు తీసి మిక్సీ లో వేయాలి .
5.అల్లాగే చిన్న బెల్లం ముక్క , ఉప్పు కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి.
6.చివరి లో బానలి లో 1/2 స్పూన్ ఉద్దిపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, కొంచం ఇంగువ వేసి , మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని కలుపుకోవాలి.
ఈ పచ్చడి అన్నము లో కలుపు కుంటే బాగుంటుంది.

