మామిడికాయ పచ్చడి(mango-chutney)
|
|
కావలసిన పదార్థాలు: మామిడికాయ---1 ఎండు మిరపకాయలు---4 లేక 5 ధనియాలు--1 టీ స్పూన్ మెంతులు----1/4 టీ స్పూన్ బెల్లం---చిన్న ముక్క ఆవాలు--1/4 స్పూన్ ఇంగువ---చిటికెడు |
విధానము:
1.మామిడికాయను చెక్కు తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.
2.బానలి పెట్టి, 1/2 స్పూన్ నూనె వేసి ధనియాలు, మెంతులు, ఎండు మిరపకాయలు వేయించుకోవాలి.
3.తరువాత మిక్సీలో,వేయించిన ధనియాలు, ఎండు మిర్చి, మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
4.తరువాత మామిడికాయ ముక్కలు, బెల్లము/చెక్కర వేసి, కొంచం నీరు వేసి గ్రైండ్ చేయాలి.
(పేస్ట్ లా కాకుండా కొంచం బరకగా గ్రైండ్ చేసుకోవాలి)
5.బానలి పెట్టి,1 స్పూన్ నూనె వేసి,ఆవాలు,ఇంగువ తిరగమాత వేసుకొని, గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమము వేసి బాగా కలపాలి.
ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ.
ఈ పచ్చడి అన్నము లో కి బాగుంటుంది.

