Website TemplatesJoomla TemplatesWeb Hosting

మామిడికాయ ఆవకాయ(Mango Pickle)

avakaaya 

కావలసిన పదార్థాలు:

మామిడికాయ ముక్కలు---4 కప్స్

ఆవాలు---3/4 కప్

కారం---3/4 కప్

ఉప్పు---- 3/4 కప్

నూనె ---1 కప్

ఇంగువ--చిటికెడు

పసుపు---1/4 స్పూన్ తా

మెంతులు---1/4 కప్

విధానము:

1.మామిడి కాయలు(6 కాయలకు 4కప్స్ ముక్కలు వస్తాయి) బాగా కడిగి, తడి లేకుండా తుడుచుకోవాలి.

2.జీడి తో పాటు పెద్ద ముక్కలుగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

3.జీడి పైన, పల్చని పొరను తిసేయాలి. లేకపొతే ఆవకాయ బూజు పడుతుంది.

4.ఆవాలు మెత్తగా గ్రైండ్ చేయాలి.

5.తడి లేకుండా  ఒక గిన్నె లో  కారం, ఆవపిండి, మెంతులు ఉప్పు,ఇంగువ, పసుపు, వేసి బాగా కలపాలి.

6.కలిపిన పిండి లో 1/2 కప్ నూనె వేసి పిండీ అంతా ముద్దలా కలపాలి.పొడి పొడి గా ఉండరాదు.

7.తరువాత తరిగి ఉంచిన మమిడికాయ ముక్కలు కొన్ని కొన్ని వేసి ,పిండీ ముక్కలకు పట్టేలా కలిపి జాడిలో వేసుకోవాలి.

 

8.ముక్కలు అన్ని పిండి లో కలిపి వేసాక చివరిలో పిండి మిగిలితే ,జాడి లో ముక్కల పైనా  వేసి ,పైనా 1/2 కప్ నూనె వేసి మూత పెట్టాలి.

9.మూత పెట్టిన జాడిని కదపకుండా, గాలి తగలకుండా మూడు రోజులు పక్కన పెట్టాలి

10.నాలుగవ రోజు ,ముక్క బాగా ఊరీ, నూనె అంతా పైకి తేలి ఉంటుంది.

11.తరువాత ఊరగాయ కిందికి పైకి బాగా కలిపి,ఒక కప్ నూనె వేయాలి.

12. ఈ ఊరగాయ 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.

ఎంతో రుచిగా ఉండే అవకాయ రెడి.ఈ ఆవకాయ అన్నంలో కి బాగుంటుంది.

గమనిక:1.ఊరగాయ చేసేటప్పుడు కొంచం కూడా తడి తగులకుండా చుసుకోవాలి.లేకపొతే ఊరగాయ బూజు పడుతుంది.

2.ఇష్టమున్న వారు పిండి కలిపేటప్పుడు, శనగలు, వెల్లుల్లి వేసుకోవచ్చు.

3.శనగలు,వెల్లుల్లి వేస్తే ఊరగాయ ఊరడానికి 7 లేక 10 రోజులు పడుతుంది.

 
Comments (1)
1 Saturday, 12 March 2011 04:14
Srinivas
I recollected my childhood when my mother was mixing "Avakaya" for long term pickling of mangos.

Thanks for giving me that opportunity.

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh