Website TemplatesJoomla TemplatesWeb Hosting

మామిడికాయ ముక్కలపచ్చడి/మెంతిబద్దలు(Cut Mango Pickle)

cut mango chutney 

కావలసిన పదార్థాలు: 

మామిడికాయ---1

ఆవాలు---1 స్పూన్

మెంతులు--1 స్పూన్

కారం---1 స్పూన్

ఉప్పు---- తగినంత

నూనె ---1 గరిట

ఇంగువ--చిటికెడు

పసుపు---1/4 స్పూన్

విధానము:

1.మామిడికాయ చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

2.మెంతులు ఎర్రగా వేయించి ,మెత్తగా గ్రైండ్ చేయాలి.

3. ఆవాలు  మెత్తగా గ్రైండ్ చేయాలి.

3.బానాలి పెట్టి, నూనె వేసి, వేడి అయ్యాక, ఆవాలు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

4.తరువాత ఇంగువ, పసుపు, కారం, ఆవపిండి,మెంతి పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

5.తరువాత తరిగి ఉంచిన మామిడికాయ ముక్కలు కూడా వేసి, పిండి అంతా  ముక్కలకు పట్టేలా కలపాలి.

6.పక్కరోజు తింటే, ముక్కలకు పిండీ పట్టి, ముక్క బాగా ఊరి చాలా బాగుంటుంది.

అంతే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ ముక్కల పచ్చడి/మెంతిబద్దలు రెడి.ఈ ఊరగాయ అన్నం లోకి చాలా బాగుంటుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh