బిసి ఉప్పినకాయ (Hot mango pickle)
|
|
కావలసిన పదార్థాలు: మామిడికాయ---1 మెంతులు---1/2 స్పూన్ ఆవాలు---3 స్పూన్స్ నూనె--3 స్పూన్స్ ఇంగువ--చిటికెడు పసుపు--చిటికెడు కారం---1/2 స్పూన్ |
విధానము:
1.మామిడికాయ కడిగి తడి లేకుండా తుడిచి, పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
2.మెంతులు నూనె లేకుండా ఎర్రగా వేయించాలి.
3.ఆవాలు,వేయించిన మెంతులు మెత్తగా గ్రైండ్ చేయాలి.
4.బానలి లో నూనె వేసి, వేడి అయ్యాక ఆవాలు వేయాలి.
5.ఆవాలు చిట చిట అన్నాక ఇంగువ, పసుపు వేసి ,తరిగి ఉంచిన మామిడికాయ ముక్కలు వేసి, మూత పెట్టి, బాగా ఉడకనివ్వాలి.
6.తరువాత మూత తీసి ముక్కలు బాగా ఉడికినాక, గ్రైండ్ చేసిన పొడి (మెంతులు+ఆవాలు), కారం, తగినంత ఉప్పు వేయాలి.
ఎంతో రుచిగా ఉండే బిసి ఉప్పినకాయ రెడి.ఇది అన్నములోకి చాలా బాగుంటుంది.
Comments (1)
1
Monday, 05 September 2011 14:28
madhavilarha
chesamandi...chala bagaa vachindi...thanu
