మామిడికాయ -కొబ్బెర పచ్చడి(mango--coconut chutney)
|
|
కావలసిన పదార్థాలు: మామిడికాయ---1 పచ్చి కొబ్బెర---1/4 కప్ ఎండు మిరపకాయలు---4 లేక 5 బెల్లం---చిన్న ముక్క ఆవాలు--1/4 స్పూన్ ఇంగువ---చిటికెడు ఉప్పు--తగినంత |
విధానము:
1.మామిడికాయను చెక్కు తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి.
2.బానలి పెట్టి, 1/2 స్పూన్ నూనె వేసి ఎండు మిరపకాయలు వేయించుకోవాలి.
3.తరువాత మిక్సీలో,వేయించిన ఎండు మిర్చి,మామిడికాయ ముక్కలు, బెల్లము/చెక్కర,ఉప్పు వేసి, కొంచం నీరు వేసి గ్రైండ్ చేయాలి.
(పేస్ట్ లా కాకుండా కొంచం బరకగా గ్రైండ్ చేసుకోవాలి)
4.బానలి పెట్టి,1 స్పూన్ నూనె వేసి,ఆవాలు,ఇంగువ తిరగమాత వేసుకొని, గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమము వేసి బాగా కలపాలి.
ఎంతో రుచిగా ఉండే మామిడికాయ-కొబ్బెర పచ్చడి రెడి.ఈ పచ్చడి అన్నము లో కి బాగుంటుంది.

