ఉద్ది పచ్చడి (urad chutney)
|
|
కావలసిన పదార్థాలు: ఉద్దిపప్పు---1 గరిట ధనియాలు--1 స్పూన్ ఎండు కొబ్బెర ముక్కలు--2 స్పూన్ ఎండు మిర్చి--5 బెల్లం--చిన్న ముక్క చింతపండు రసం—1/2 స్పూన్ కరివేపాకు—5-10 ఆకులు ఉప్పు—తగినంత |
విధానము:
1 బానలి లో 1/2 స్పూన్ నూనె వేసి ఉద్దిపప్పు, ధనియాలు, ఎండు మిర్చి, ఎండు కొబ్బెర వేసి వేయించాలి.
2.తరువాత మిక్సీ జార్ లో వేయించిన వేసి, కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
3.తరువాత బానలి లో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక 2 స్పూన్ ఉద్దిపప్పు ,1/2 స్పూన్ ఆవాలు ,ఇంగువ, కరివేపాకు వేసి తిరగమాత వేసుకోవాలి
4.తర్వాత వేయించిన తిరగమాతలో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలపాలి.
ఎంతో రుచిగా ఉండే ఉద్ది పచ్చడి రెడి.
