Website TemplatesJoomla TemplatesWeb Hosting

ఉల్లిపాయ పచ్చడి (Onion Chutney)

 

కావలసిన పదార్థాలు:

ఉల్లిపాయలు--2
పచ్చి కొబ్బెర--చిన్న ముక్క
ఎండు మిర్చి--5

ఉప్పు--తగినంత
శనగ పప్పు--1 స్పూన్
చింతపండు రసం--1/2 స్పూన్
తిరగమాత:
ఆవాలు--1/4 స్పూన్
ఉద్దిపప్పు--1/4 స్పూన్
కరివేపాకు--5-10 ఆకులు

 విధానము:

1. శనగ పప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.

2.తరువాత మిక్సీ జార్ లో వేయించిన శనగ పప్పు, కొబ్బెర, చింతపండు రసం ఉప్పు, ఎండు మిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

3.తరువాత  ఉల్లిపాయలు వేసి బరకగా గ్రైండ్ చేయాలి.

4.బానలి లో  2స్పూన్స్ నూనె వేసి  వేడి అయ్యాక ,ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు తిరగమాత వేసుకొని, అందులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడి.ఈ పచ్చడి అన్నంలో/ఇడ్లి తో తింటే చాలా బాగుంటుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh