Website TemplatesJoomla TemplatesWeb Hosting

కంది పచ్చడి (Toordal Chutney)

 kandi-kobbera chutney

కావలసిన పదార్థాలు:

కంది పప్పు--1 గరిట(1/2 కప్)
జీలకర్ర--1/2 స్పూన్
ఎండు మిర్చి---4
చింతపండు రసం--1/2 స్పూన్
ఉప్పు --తగినంత
తిరగమాత:
ఆవాలు--1/4 స్పూన్
ఇంగువ—చిటికెడు
కరివేపాకు--- 5-10 ఆకులు

 విధానము:

1.బానలి లో 1/2 స్పూన్ నూనె వేసి కంది పప్పు, ఎండు మిర్చి, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.

2.తరువాత మిక్సీ జార్ లో వేయించిన కంది పప్పు, ఎండు మిర్చి, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి, కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

3.తరువాత బానలి లో 1 స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, ఆవాలు, ఇంగువ ,కరివేపాకు వేసి తిరగమాత వేసుకోవాలి.

4.తరువాత తిరగమాత లో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలపాలి.

ఎంతో రుచిగా ఉండే కంది పచ్చడి రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh