Website TemplatesJoomla TemplatesWeb Hosting

కరివేపాకు పచ్చడి (Curry Leaves Chutney)

kariveapaku chutney 

కావలసిన పదార్థాలు:

కరివేపాకు-- 1 కప్
ధనియాలు--1/2 స్పూన్
ఉద్దిపప్పు---3 స్పూన్
శనగ పప్పు---1 స్పూన్
ఎండు మిర్చి---5
బెల్లం/చెక్కర--1/2 స్పూన్
చింతపండు రసం--1/2 స్పూన్
తిరగమాత :
ఆవాలు--1/4 స్పూన్
ఇంగువ-- చిటికెడు
ఉప్పు--తగినంత

 విధానము:

1.బానలి లో 1 నూనె వేసి ధనియాలు, ఉద్దిపప్పు, శనగ పప్పు ,ఎండు మిర్చి, వేసి దోరగా వేయించి, స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసి వేయించాలి.

2.మిక్సీ జార్ లో వేయించిన  ఉద్దిపప్పు ,శనగ పప్పు, ఎండు మిర్చి, ధనియాలు, కరివేపాకు, చింతపండు , బెల్లం,  ఉప్పు వేసి కొద్దిగా నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

3.చివరిలో ఆవాలు, ఇంగువ తిరగమాత వేసి, గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పచ్చడి రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh