గోంగూర పచ్చడి (Gongura Chutney)
|
|
కావలసిన పదార్థాలు: |
విధానము:
1.గోంగూర ఆకులుగా తీసి, బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2.నువ్వులు, నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి.
3.తరువాత బానలిలో 1/2స్పూన్ నూనె వేసి, ధనియాలు, ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి.
4.తరువాత 2 స్పూన్స్ నూనె వేసి, కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర, కట్ చేసిన పచ్చి మిర్చి వేసి మూత పెట్టకుండా ఎర్రగా వేయించాలి.(మూత పెడితే నీరు వచ్చి పచ్చడి నిల్వ ఉండదు)
5.తరువాత మిక్సీ జార్ లో వేయించిన నువ్వులు, ఎర్ర మిరపకాయలు, ధనియాలు, గోంగూర, పచ్చి మిర్చి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
6.తరువాత బానలి లో 1 స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు తిరగమాత వేసి, అందులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలపాలి.
ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి రెడి.
గమనిక:ఇష్టమున్నవారు ఉల్లిపాయలు,వెల్లుల్లి నూనెలో వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది.

