Website TemplatesJoomla TemplatesWeb Hosting

బెండకాయ పచ్చడి (Ladyfinger chutney)

 

కావలసిన పదార్థాలు:

బెండకాయలు--1/4 కేజి

పచ్చి మిర్చి--5

జీలకర్ర--1 స్పూన్

చింతపండు రసం--1 స్పూన్

తిరగమాత గింజలు--
ఆవాలు--1/4 స్పూన్

ఉద్దిపప్పు--1/4 స్పూన్

శనగ పప్పు--1/4 స్పూన్

 విధానము:

1.బెండకాయలు బాగా కడిగి, చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2.బానలి లో 3 స్పూన్స్  నూనె వేసి, బెండకాయలను ఎర్రగా వేయించాలి.

3.కట్ చేసిన పచ్చి మిర్చి కూడా వేయించి పక్కన  పెట్టుకోవాలి.

4.తరువాత రోట్లో బెండకాయలు, పచ్చి మిర్చి చింతపండు, ఉప్పు వేసి కచ్చా పచ్చా గా నూరుకోవాలి (మెత్తగా పేస్ట్ లా కాకుండా)

5.తరువా బానలి లో 2 స్పూన్స్ నూనె వేసి తిరగమాత వేసుకొని అందులో దంచుకున్న బెండకాయ మిశ్రమాన్ని కలపాలి.

ఎంతో రుచిగా ఉండే బెండకాయ పచ్చడి  రెడి. ఈ పచ్చడి అన్నంలో బాగుంటుంది.

గమనిక: ఈ పచ్చడి మిక్సీ లో గ్రైండ్ చేస్తే బాగుండదు.

ఇష్టమున్నవారు  వెల్లుల్లి నూనె లో వేయించి కలుపుకోవచ్చు.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh