Website TemplatesJoomla TemplatesWeb Hosting

టమొటా పెరుగు పచ్చడి(Tamoto-curd chatni)

tomoto perugu pachadi 

కావలసిన పదార్థాలు:

టమొటాలు--3
కమ్మటి పెరుగు--3 కప్పులు
ఉద్దిపప్పు--1 స్పూన్
ఆవాలు--1/2 స్పూన్
ఎర్ర మిరపకాయలు--4
పచ్చి మిరపకాయలు--2
ఇంగువ--చిటికెడు
ఉప్పు--తగినంత
కొత్తిమీర--3-4 రెమ్మలు
నూనె--4 స్పూన్స్

 విధానము:

1.టమోటాలు,పచ్చి మిర్చి ముక్కలు గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

2.బాణలి లో నూనె వేసి ఉద్దిపప్పు, ఆవాలు, ఎర్ర మిర్చి, ఇంగువ వేయించుకోవాలి.

3.వేయించిన తిరగమాతను సగ భాగము పక్కన పెట్టుకొని, మిగిలిన సగ భాగము లో తరిగిన టమొటా ముక్కలు, పచ్చి మిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి.

4.తరువాత మగ్గిన టమొటాలను గ్రైండ్ చేయాలి.

5.గ్రైండ్ చేసిన పేస్ట్ పెరుగు లో కలిపి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

6.ఇలాతయారు ఐన  పెరుగులో పక్కన పెట్టుకున్న సగ భాగము తిరగమాత, కొత్తిమీర వేసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే టమొటా పెరుగు పచ్చడి రెడి. ఇది పులావ్, బిర్యాని, అన్నం లో కూడా చాలా బాగుంటుంది.

perugupachadi

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh