Website TemplatesJoomla TemplatesWeb Hosting

పుదీన ఊరగాయ (Mint Pickle)

 

కావలసిన పదార్థాలు:

పుదీన--12  కట్టలు
నూనె--6 గరటలు
ఎర్ర మిరపకాయలు--15
ఆవాలు--2 స్పూన్స్
మెంతులు---1/2 స్పూన్
నువ్వులు--2 స్పూన్స్
పసుపు-- చిటికెడు
ఇంగువ--చిటికెడు
చింతపండు--నిమ్మకాయంత
ఉప్పు--తగినంత

 విధానము:

1.పుదీన బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.

2.తడి లేకుండా శుభ్రంగా  ఉన్న బట్టపై కడిగిన పుదీన ఆరేయాలి.

3.నువ్వులు దోరగా సన్నటి సెగపై  వేయించాలి.

4.బానలిలో 4 స్పూన్స్ నూనె వేసి ఎర్ర మిర్చి, మెంతులు, ఆవాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.

5.తరువాత 2 గరిటలు నూనె వేసి  పుదీన, పసుపు,ఇంగువ వేసి,2 నిముషలు వేయించాలి.

6. వేయించిన పుదీన లో  చింతపండు వేసి దోరగా వేయించాలి.

7. తరువాత నువ్వులు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

8. ఎండు మిర్చి, మెంతులు, ఆవాలు, ఉప్పు  వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

9.తరువాత వేయించిన పుదీన వేసి ఒక్క సారి గ్రైండ్ చేయాలి.

10. ఒక గిన్నె లో పుదీన ఊరగాయ వేసి, మరి కొద్దిగా నూనె వేసి, వేయించిన ఎండు మిర్చి వేసి బాగా కలపాలి.

ఎంతో రుచిగా ఉండే పుదీన ఊరగాయ రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh