వేరు శనగ పచ్చడి (Peanut Chutney)
|
|
కావలసిన పదార్థాలు: వేరు శనగ విత్తనాలు --- 1 కప్ పచ్చి మిర్చి---4 లేక 6 వెల్లుల్లి---2 ఉప్పు---తగినంత 1/2స్పూన్ చింతపండు రసం---1/2స్పూన్ తిరగమాత: నూనె---1 టీ స్పూన్ ఆవాలు ---1/4స్పూన్ ఉద్దిపప్పు---1/4 స్పూన్ ఎండు మిరపకాయలు---2 కరివేపాకు---3 లేక 5 ఆకులు ఇంగువ---చిటికెడు |
విధానము:
1.వేరు శనగ విత్తనాలు ,వేయించి పొట్టు తీయాలి.
2.మిక్సీ జార్ లో వేయించిన వేరుశనగ విత్తనాలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి, ఉప్పు, చింతపండు రసం వేసి , గ్రైండ్ చేయాలి.
3.కొంచం నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
4.మెత్తగా చేసిన వేరు శనగ పచ్చడి ని , ఒక గిన్నెలో తీసుకోవాలి.
5.తరువాత తిరగమాత వేసుకోవాలి .(బానలి పెట్టి ,నూనె వేసి ,వేడి అయ్యాక, ఉద్దిపప్పు ,ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేయాలి)
6.గ్రైండ్ చేసుకున్న వేరు శనగ పచ్చడి పైన ,తిరగమాత వేసుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే వేరు శనగ పచ్చడి రెడి.

