Website TemplatesJoomla TemplatesWeb Hosting

కొబ్బెర-పప్పుల పచ్చడి (Coconut-Daliya Chutney)

coconut chutney 

కావలసిన పదార్థాలు:

పచ్చి కొబ్బెర తురుము---1 కప్
పచ్చి మిర్చి---5 లేక 6
అల్లం---1"చిన్న ముక్క
పప్పులు---1/2 కప్
ఉప్పు---1/2 టీ స్పూన్(తగినంత)
చింతపండు  రసం ---1/2స్పూన్
తిరగమాత:
నూనె---1 స్పూన్
ఆవాలు---1/4స్పూన్
ఉద్దిపప్పు---1/4స్పూన్
ఎండు మిరపకాయలు -----2
కరివేపాకు---3 లేక 5 ఆకులు
ఇంగువ---చిటికెడు

విధానము:

1.మిక్సీ జార్ లో, పచ్చికొబ్బెర,పప్పులు,పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన అల్లము, చింతపండు రసం, ఉప్పు వేయాలి.
2. మిక్సీ జార్ లో వేసినవన్ని మెత్తగా రుబ్బాలి.
3.కొంచము నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
4.గ్రైండ్  చేసిన పేస్ట్ ఒక  గిన్నె లో వేయాలి.
5.తరువాత  తిరగమాత  వేసుకోవాలి.
(బానలిలో,కొంచం నూనె వేసి,వేడి అయ్యాక ఉద్దిపప్పు,ఆవాలు, ఎండు మిరపకాయలు,ఇంగువ,కరివేపాకు వేయాలి)
6.వేసుకున్న తిరగమాత గ్రైండ్ చేసుకున్న  కొబ్బెర-పప్పుల పచ్చడి లో వేయాలి.

ఎంతో రుచిగా  ఉండే కొబ్బెర-పప్పుల పచ్చడి రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh