Website TemplatesJoomla TemplatesWeb Hosting

వేరు శనగ - కొబ్బెర పచ్చడి (Peanut Coconut Chutney)

Peanut Coconut chutney

కావలసిన పదార్థాలు:

వేరు శనగ విత్తనాలు --- 1 కప్
పచ్చి కొబ్బెర(ముక్కలు గా)---1/2కప్
పచ్చి మిర్చి---4 లేక 6 
వెల్లుల్లి---2
ఉప్పు---తగినంత 1/2స్పూన్
చింతపండు  రసం---1/2స్పూన్
తిరగమాత:
నూనె---1 టీ స్పూన్
ఆవాలు ---1/4స్పూన్
ఉద్దిపప్పు---1/4 స్పూన్
ఎండు మిరపకాయలు---2
కరివేపాకు---3 లేక 5 ఆకులు
ఇంగువ---చిటికెడు

విధానము:

1.వేరు శనగ విత్తనాలు ,వేయించి పొట్టు తీయాలి.
2.మిక్సీ జార్ లో వేయించిన  వేరుశనగ  విత్తనాలు,పచ్చి కొబ్బెర ముక్కలు,
పచ్చి మిర్చి,వెల్లుల్లి,ఉప్పు,చింతపండు రసం  వేసి ,గ్రైండ్ చేయాలి.
3.కొంచం నీరు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
4.మెత్తగా చేసిన  వేరు శనగ .బొబ్బెర పచ్చడి ని ,ఒక గిన్నెలో తీసుకోవాలి.
5.తరువాత తిరగమాత వేసుకోవాలి .
(బానలి  పెట్టి ,నూనె  వేసి ,వేడి అయ్యాక, ఉద్దిపప్పు,ఆవాలు, ఎండు మిరపకాయలు,కరివేపాకు, ఇంగువ వేయాలి)
6.గ్రైండ్ చేసుకున్న వేరు శనగ -కొబ్బెర పచ్చడి  పైన ,తిరగమాత వేసుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే  వేరు శనగ- కొబ్బెర పచ్చడి రెడి.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh