మా వంటలు.కాం - మన తెలుగు వంటలతో పాటు,ఎన్నో ఎన్నెన్నో రుచులు మీకు అందించడానికి తయారు చేయబడింది. తెలుగు అభిమానుల కోసం ప్రత్యేకించి తెలుగు లిపి లో,అద్భుత రుచులు మీ ఇంట్లో, మీ కంప్యూటర్ ద్వారా, మీకు అందించాలని మా ప్రయత్నం. మీ అందరి అభిప్రాయాలు,సలహాలు,ఆశీర్వాదములతో ఇంకా, ఎన్నోఅద్భుత రుచులను మీకు అందించాలని ఈ "మా వంటలు" తాపత్రయం.
"అన్నదాత సుఖీభవ" అన్నఆశీర్వాదం,అందరూ అందుకోగలమని ఆశిస్తున్నాం.....నమస్తే.

కొత్త వంటలు:
మద్దూరు వడ (Madduru Vada )
|
|
విధానము:
1.ఉల్లిపాయలు చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2.వేరు శనగ విత్తనాలు వేయించి, పొట్టు తీసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

3.పచ్చిమిర్చి,కొత్తిమీర,కరివేపాకు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

4.తరువాత ఒక గిన్నె లో బియ్యప్పిండి, బొంబాయి రవ, మైదా వేయాలి

5.తరువాత సోడ, ఇంగువ వేసి బాగా కలపాలి.

6.తరువాత గ్రైండ్ చేసిన వేరు శనగ పొడి, పచ్చి మిర్చి మిశ్రమము, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
7.చివరిలో నువ్వులు వేయాలి.

8.తరువాత తగినంత ఉప్పు వేసి మిశ్రమం బాగా కలిసేలా కలపాలి.

9.తరువాత దానిపై నూనె వేసి ముద్దగా కలపాలి.

10.ఇప్పుడు మద్దూరు వడ మిశ్రమం తయారు అయ్యింది.

11.ఇలా తయారు అయిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉంటలు గా చేసుకోవాలి.
12.తరువాత చిన్న గా చేసుకున్న ఉంటను ప్లాస్టిక్ పేపర్ మీద పెట్టి వత్తాలి.

13.ఇలా వత్తిన వడలను నూనె లో వేయించాలి.
14.తరువాత వేయించిన వడలను ప్లేట్ లో పెట్టుకోవాలి.

ఎంతో రుచిగా ఉండే మద్దూరు వడ రెడి. ఈ వడ సాస్/కొబ్బెర పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది.

గమనిక:మద్దూరు వడ పిండి కలిపేటప్పుడు నీరు వాడకుండా నూనె తో కలిపితే చాలా బాగుంటుంది.
2.నూనె ఎక్కువ అవుతుంది అనుకునేవారు 3/4 నూనె,1/4 నీరు వేసుకొని కూడా పిండి కలుపుకోవచ్చు.నిప్పట్టు(Nipattu)
|
బియ్యప్పిండి--5 కప్స్ వేరు శనగ విత్తనాలు--1 కప్ పప్పులు-- 1కప్ కొబ్బెర పొడి--1 కప్ కారం--1 స్పూన్ నువ్వులు--2 స్పూన్స్ ఇంగువ--1/2 స్పూన్ నూనె--1/4 కప్ నూనె--4 కప్స్(వేయించడానికి) |
విధానము:
1.ఒక గిన్నె లో బియ్యప్పిండి వేసుకోవాలి.

2.దానిలోకి వేరు శనగ విత్తనాలు పొడి వేయాలి.(వేయించి పొడి చేయాలి)

3.తరువాత పప్పుల పొడి వేయాలి.(వేయించనవసరం లేదు)

4.తరువాత కొబ్బెర పొడి వేయాలి.

5.తరువాత కారం వేయాలి.

6.నువ్వులు వేయాలి.(వేయించనవసం లేదు)

7.తరువాత ఉప్పు, ఇంగువ వేసి బాగా కలపాలి.

8.చివరిలో నూనె వేసి బాగా కలపాలి.

9.ఇలా కలిపిన పిండిని కొద్దిగా చేతితో తీసుకుంటే ఉంటలా రావాలి.
(ఒకవేల ఉంట రాకపోతే మరికాస్త నూనె వేయాలి. పిండి ఉంట రాకపోతే నిప్పట్టు చేసేటప్పుడు విరిగిపోతాయి)

10.తరువాత ఒక చిన్న గిన్నె లో కొద్దిగా పిండి తీసుకోవాలి.
.jpg)
11.కొద్దిగా తీసుకున్న పిండి లో, కొద్ది కొద్దిగా నీరు వేసి కలపాలి.

12.జారుగా కాకుండా గట్టిగా పిండిని కలపాలి.( నిప్పట్టు చేయడానికి వీలుగా కలపాలి)

13.తరువాత ప్లాస్టిక్ పేపర్ పై కొద్దిగా నూనె వేసి, పిండిని చిన్నగా ఉంటగా చేసి పెట్టాలి.

14.ఉంటగా చేసిన పిండిని చేతితో గుండ్రంగా తట్టి, మధ్య లో రంద్రం పెట్టాలి.(ఇష్టము లేకపోతే మధ్య లో రంద్రం పెట్టనవసరం లేదు)

15.తరువాత బానలి లో నూనె పెట్టి వేడి చేయాలి.
16.తరువాత తయారు చేసుకొన్న నిప్పట్లను నూనె లో వేసి రెండు వైపులా ఎర్రగా వేయించాలి.

ఎంతో రుచిగా ఉండే నిప్పట్టు రెడి.

కావలసిన పదార్థాలు:
www.maavantalu.com/tl-more-tiffins/498-tl-murmura-upma
ulavalanu(1/2 glass)tisukoni andulo 5-6 glass water veasi baagaa marlinchaali.niru baagaa taggipoyeadaka marlinchi,uppu,chintapandu,karivepaaku,kottimira,koddigaa karam/rasam podi veasi baagaa marilinchi chivarilo tiragamaata pettukovaali.
Two language use in amazing
Thanks for maavantalu.
me annaya ki chala ishtamina aitem pettavu. nenu thappakunda try chestanu. and also good sweet item.even pics also very nice. detailed explanation. no one can give this much clear.
real ga chala bagunnai. cheyatam kuda konchem easygane undi.nenu kuda try chestanu.photos chala baga vachai. fresh ga unnai.