మా వంటలు.కాం - మన తెలుగు వంటలతో పాటు,ఎన్నో ఎన్నెన్నో రుచులు మీకు అందించడానికి తయారు చేయబడింది. తెలుగు అభిమానుల కోసం ప్రత్యేకించి తెలుగు లిపి లో,అద్భుత రుచులు మీ ఇంట్లో, మీ కంప్యూటర్ ద్వారా, మీకు అందించాలని మా ప్రయత్నం. మీ అందరి అభిప్రాయాలు,సలహాలు,ఆశీర్వాదములతో ఇంకా, ఎన్నోఅద్భుత రుచులను మీకు అందించాలని ఈ "మా వంటలు" తాపత్రయం.
"అన్నదాత సుఖీభవ" అన్నఆశీర్వాదం,అందరూ అందుకోగలమని ఆశిస్తున్నాం.....నమస్తే.

కొత్త వంటలు:
చిరోటి /స్వీట్ పూరీ/పదర్ పేణి(Chiroti/Sweet Poori/Padar Peni)
|
మైదా--1 కప్ చెక్కర--1 కప్ నెయ్యి--4 టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి--2 టేబుల్ స్పూన్స్ ఉప్పు--చిటికెడు నూనె--3 కప్స్(వేయించడానికి) నీరు--పిండి కలపడానికి |
విధానము:
1.ఒక గిన్నె లో మైదా వేసుకోవాలి.
.jpg)
2.అందులోకి చిటికెడు ఉప్పు వేయాలి.

3.తరువాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి.

4.తరువాత పిండిని బాగా కలిపి కొద్ది కొద్దిగా నీరు పోసి, పూరీ పిండిలా కలపాలి.

5.తరువాత కలిపిన పిండిని మూత పెట్టి, 30 నిముషాలు నాననివ్వాలి.
.jpg)
6.పిండి నానడం వల్ల మృదువుగా మెత్తగా అవుతుంది.

7.తరువాత నానిన పిండిని 5 సమ భాగాలుగా ఉంటలు చేసుకోవాలి

8.తరువాత చపాతి పీటపై ఒక్కో ఉంటను పెట్టి చపాతీలా చేసుకోవాలి.

9.అన్ని ఉంటలను చపాతీలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

10.తరువాత ఒక చిన్న గిన్నె లో 2 స్పూన్స్ బియ్యప్పిండి+2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

11.తరువాత ఒక చపాతి తీసుకొని దానిపై బియ్యప్పిండి మిశ్రమాన్ని పూయాలి.

12.తరువాత మరొక చపాతి తీసుకొని, మొదటి చపాతికి కొద్దిగా కింద పెట్టి దానికి కూడా బియ్యప్పిండి మిశ్రమాన్ని పూయాలి.

13.ఇలా అన్నీ చపాతీలు ఒకదాని కింద ఒకటి పెట్టి, ప్రతీ చపాతీకి బియ్యప్పిండి మిశ్రమాన్ని పూయాలి.
.jpg)
14.తరువాత వాటిపై 1/2 స్పూన్ మైదా పిండి చిలకరించాలి.
.jpg)
15.తరువాత మిశ్రమాన్ని పూసిన చపాతీలను చివరి నుంచి చాపలా గుండ్రంగా చుట్టాలి.

16.ఇలా చుట్టిన పిండిని చపాతి పీటపై పెట్టుకోవాలి.

17.తరువాత పిండిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
.jpg)
18.కట్ చేసిన ముక్కలను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.

19.తరువాత ఒక్కొక్క ముక్కను పూరీలా వత్తుకోవాలి.
.jpg)
20.అన్నీ ముక్కలను పూరీలా వత్తుకొని పక్కన పెట్టుకోవాలి.

21.తరువాత ఒక గిన్నెలో 1 కప్ చెక్కర వేసి,2 కప్స్ నీరు వేసి బాగా మర్లించాలి.

22.తరువాత చెక్కర బాగా బుడగలు బుడగలుగా వస్తుంటే అప్పుడు పాకం వస్తోంది అని అర్థం.
.jpg)
23.తరువాత బుడగలు కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. లేకపోతే ముదురు పాకం వస్తుంది.( స్వీట్ పూరీలకు తీగ పాకం చేసుకోవాలి)

24.మీరు ఇప్పుడు పాకం స్పూన్/గరిట తో చూస్తే తీగలా వస్తుంది.
.jpg)
25.ఇలా తయారు చేసుకున్న పాకం పక్కన పెట్టుకోవాలి. పాకం గట్టి పడకుండా చిటికెడు నిమ్మకాయ రసం/1 స్పూన్ నూనె గాని వేసుకోవాలి. (నిమ్మకాయ రసం ఎక్కువ పిండితే పాకం పుల్లగా అవుతుంది)
26.తరువాత నూనె వేడికి పెట్టి, వేడి అయ్యాక తయారు చేసుకున్న పూరీలను వేసి, రెండు వైపులా వేయించాలి.

27.ఇలా వేయించిన పూరీలను తయారు చేసుకున్న పాకం లో వేసి 1 నిముషం ఉంచి తీసేయాలి.(ఎక్కువ సేపు నాన అవసరం లేదు)

28.అన్నీ పూరీలను దోరగా వేయించి పాకం లో ముంచి ప్లేట్ లో పెట్టుకోవాలి.

29. పాకంలో వేయడం ఇష్టం లేని వారు పూరీలను వేయించి, దాని పై చెక్కర కూడ వేసుకోవచ్చు.(వేడి పూరీలపై చెక్కర వేస్తే చెక్కర ఊడిపోకుండా ఉంటుంది)

అంతే ఎంతో రుచిగా ఉండే చిరోటి/స్వీట్ పూరీ/పదర్ పేణి రెడి.
ఈ పూరీలు, చెక్కర వేసిన/పాకం లో వేసిన ఏ విధంగా చేసిన చాలా బాగుంటాయి.గుంత పొంగనాలు/పొంగనాలు(Guntaponganalu)
|
|
కావలసిన పదార్థాలు:
దోస పిండి---3 కప్స్ |
విధానము:
1.ఉల్లిపాయలు,పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర చిన్నగా తరిగి ఉంచుకోవాలి.
2.బానలి లో కొద్దిగా నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ తిరగమాత వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
3.ఒక గిన్నె లో దోస పిండి వేసి, అందులోకి, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, తిరగమాత వేసి బాగా కలపాలి. ఇప్పుడు పొంగనాలకు పిండి రెడి అయ్యింది.

4.తరువాత పొంగనాల పెనం లో నూనె రాసి తయారు చేసుకున్న దోస పిండి వేసుకోవాలి.

5.తరువాత పెనం లో వేసుకొన్న పిండిని స్టవ్ మీద పెట్టి, మూత పెట్టాలి.
6.తరువాత పొంగనాలు బాగా ఉడికినాక (కొంచం లావుగా అయ్యాక)రెండో వైపు కూడా తిప్పి ఉడకనివ్వాలి.
7.ఎంతో రుచిగా ఉండే గుంత పొంగనాలు రెడి. పొంగనాలు వేరు శనగ పప్పుపచ్చడి లేక కొబ్బరి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది.

గమనిక:పొంగనాల పెనం నాన్ స్టిక్ అయితే నూనె వేయనక్కర లేదు.
మసాల చపాతి (Masala Chapathi)
|
|
కావలసిన పదార్థాలు: చపాతి/పరాట--2 ఉల్లిపాయ-1 వేరు శనగ విత్తనాలు--1 స్పూన్ పసుపు--1/2 టీ స్పూన్ ఎర్ర కారం--1/4 టీ స్పూన్ ఉప్పు--తగిననత గరం మసాల--చిటికెడు కరివేపాకు---5 కొత్తిమీర--2 రెమ్మలు ఆవాలు--1/2 స్పూన్ నూనె--2 టేబుల్ స్పూన్స్ |
విధానము:
1.బాణలి లో 2 స్పూన్స్ నూనె వేసివేడి అయ్యాక ఆవాలు వేయాలి.

2.ఆవాలు చిట చిట అన్నాక వేరుశనగ విత్తనాలు,కరివేపాకు వేయాలి.
3.తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
4.తరువాత పసుపు,కారం ఉప్పు వేయాలి.
5.తరువాత చపాతి/పరాట చిన్న ముక్కలుగా చేసి వేసి బాగా కలపాలి.
6.చివరిలో గరం మసాల,1 స్పూన్ నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి.
7.చివరిలో కొత్తిమీర వేయాలి.
ఎంతో రుచిగా ఉండే మసాల చపాతి/పరాట రెడి.ఇది స్నాక్/టిఫెన్ గా తినవచ్చు.
బూంది లడ్డు (Boondi Laddu)
![]() |
కావలసిన పదార్థాలు : నూనె---- 3 గ్లాసులు |
విధానము:
1.ఒక గిన్నె లో చెక్కర వేసి, చెక్కర మునిగే లా నీరు వేయాలి.

2.తరువాత స్టవ్ మీద పెట్టి తీగ పాకం చేసుకోవాలి.

3.తరువాత నెయ్యి లో జీడిపప్పు, ద్రాక్ష వేయించుకోవాలి.

4.పాకము లో వేయించిన జీడిపప్ప, ద్రాక్ష వేసి పక్కన పెట్టుకోవాలి.

5.తరువాత నూనె వేడి కు పెట్టాలి..

6.నూనె వేడి అయ్యెలోపు శనగ పిండి ,నీరు (శనగ పిండి 2 గ్లాసులు+ నీరు 2 గ్లాసులు) వేసి కొంచము జారు గా, బూంది వచ్చెలా కలుపుకోవాలి.

7.నూనె వేడి అయ్యాక బూంది గరిటలో కొద్దిగా శనగ పిండి వేసి బూంది చేసుకోవాలి.

.jpg)
8.ఇలా చేసిన బూందిని తయారు చేసుకున్న పాకములో వేసుకోవాలి.

9.పాకము వున్నంత వరకే బూంది వేయాలి.
10.తరువాత చివరిలో పచ్చ కర్పూరము, ఏలకుల పొడి, కలకండ పలుకులు వేసి బాగా కలపాలి.

.jpg)
11.తరువాత కొద్ది కొద్దిగా బూంది ని గిన్నెలో తీసుకొని లడ్డులా కట్టుకోవాలి.( మిగిలిన బూంది పై మూత పెట్టాలి.లేకపోతే బూంది గాలికి ఆరి లడ్డు కట్టడం కష్టమౌతుంది)
.jpg)
.jpg)
అంతే ఎంతో రుచిగా ఉండే బూంది లడ్డు రెడి.
గమనిక:బూంది పొడి పోడి ఉండి లడ్డు కట్టడం కష్టమైతే కొద్దిగా పాలు వేసి కట్టుకోవచ్చు.


.jpg)

www.maavantalu.com/tl-more-tiffins/498-tl-murmura-upma
ulavalanu(1/2 glass)tisukoni andulo 5-6 glass water veasi baagaa marlinchaali.niru baagaa taggipoyeadaka marlinchi,uppu,chintapandu,karivepaaku,kottimira,koddigaa karam/rasam podi veasi baagaa marilinchi chivarilo tiragamaata pettukovaali.
Two language use in amazing
Thanks for maavantalu.
me annaya ki chala ishtamina aitem pettavu. nenu thappakunda try chestanu. and also good sweet item.even pics also very nice. detailed explanation. no one can give this much clear.
real ga chala bagunnai. cheyatam kuda konchem easygane undi.nenu kuda try chestanu.photos chala baga vachai. fresh ga unnai.