బిసి బెల్లి బాత్(Bisi beli Baath)
|
|
కావలసిన పదార్థాలు : బియ్యము-- 1 కప్ |
విధానము :1
1.బియ్యము,కంది పప్పుకలిపి ఉడక బెట్టుకోవాలి.
(విడిగా కూడా బియ్యము కందిపప్పుఉడకబెట్టుకోవచ్చు)
2.అలాగే తరిగిన కూరలు, ఇందులోనే, వేరుశనకాయ విత్తనాలు, బఠానీలు, కొంచం పసుపు వేసి ఉడకనివ్వాలి.
3.కూరలు,అన్నము, ఉడికేలోపు పొడి చేసుకోవాలి.
పొడి చేసుకునే విధానము:2
ఉద్దిపప్పు ---- 1 గరిట
శెనగపప్పు ---- 1 గరిట
దనియాలు ----1 గరిట
ఎండుమెరపకాయలు -----20
లవంగాలు ----10
చెక్క ----5 పీసెస్
మొగ్గ----5 పీసెస్
పువ్వు ----5 పీసెస్
పైన చెప్పినవన్ని 1/2 చమ్చా నూనె వేసి, వేయించుకొని మెత్త గా గ్రైండ్ చేసుకోవాలి.
విధానము :3
1.ఇప్పుడు గిన్నెలోకి ఉడికిన కూరలు, అన్నము,కందిపప్పు అన్నీ వేసుకోవాలి.
2.తరువాత నానపెట్టుకున్న చింతపండు గొజ్జు, బిసిబెల్లిబాత్ పొడి, ఎండుకొబ్బెర వేసి, బాగా వుడకనివ్వాలి.
3.పొడి అంతా అన్నము లో కలిసి, మంచి వాసన వస్తున్నపుడు,
4. వేరొక బానలి తీసుకొని, కొంచము నూనె వేసి, ఎర్ర మిపరకాయలు 10,1/2 స్పూన్ ఉద్దిపప్పు, శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ,
3 లవంగాలు, కరివేపాకు వేసి ,చిట చిట అన్నాకా, అన్నము లో వేసి, వేయించిన జీడి పప్పు కూడా వేసి బాగా కలిపి, స్టవ్ కట్టెసి,మూత పెట్టాలి.
5.కాసేపు అయ్యాక తింటే బాగా ఊరీ రుచిగా ఉంటుంది.
అంతే ఎంతో రుచి గా వుండే బిసి బెల్లి బాత్ రెడి .
చిట్కా:ఇత్తలి సామాను నల్లగా ఉంటే,దానికి చింతపండు గుజ్జు పూసి,అరగంట నానపెట్టి తరువాత కడిగితే కొత్తవాటిలా వుంటాయి.


kandipappu ni without oil tho fry chesi veyandi manchi vasanatho (gummagummaladuthu ) untundi.
thanq