వంకాయ పచ్చడి (Brinjal Chutney)
|
|
కావలసిన పదార్థాలు: వంకాయలు ----- 4 పచ్చిమెరపకాయలు -----3 మెంతులు ---- 1/2 స్పూన్ నునె ----1 గరిట ఉప్పు ---తగినంత కరివేపాకు --2 రెమ్మలు కొత్తిమీర ----2 రెమ్మలు చింతపండు ---1 స్పూన్ (నానబెట్టుకోవాలి) పసుపు ---- 1/4 స్పూన్ తిరగమాత గింజలు:(అన్నీ1/2 స్పూన్) ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర) |
విధానము :
1.కొంచము నూనె వేసుకొని, ఉద్దిపప్పు, శెనగ పప్పు,ఆవాలు, జీలకర్ర,మెంతులు,ఇంగువ
,కొత్తిమీర,కరివేపాకు తిరగమాత వేసుకోవాలి. తరువాతా తిరగమాత, పక్కన పెట్టుకో వాలి.
2 అదే బానలి లో,కొంచము నూనె వేసి, వంకాయలు,పచ్చిమెరపకాయలు, చింతపండు,ఉప్పువేసి
బాగా మగ్గించాలి.మెత్తగా అయ్యేంత వరకు మగ్గించాలి.
3.మగ్గిన వంకాయలను రోట్లో వేసుకొని దంచుకోవాలి.రోలు లేకపోతే మందము గరిట తో,
పచ్చడి లా చేసుకోవాలి.(ఈ పచ్చడి మిక్సీలో వేసుకుంటే పేస్ట్ లా అవుతుంది)
4.పచ్చడిలా చేసుకున్నమగ్గిన వంకాయలు,పక్కన పెట్టుకున్న తిరగమాత కూడా వేసి కలిపేయాలి.
ఎంతో రుచి గా వుండే, వంకాయ పచ్చడి రెడి.
Comments (1)
1
Monday, 06 February 2012 12:01
SHOBHADCP@GMAIL.COM
DFD

