దాల్ పూరీ (Daal Puri )
|
కావలసిన పదార్థాలు: పెసలు --- 1 కప్ |
విధానము:
1.పెసలు,శెనగలు నీరు పోసి 4 గంటలు నాన పెట్టి మెత్తగా రుబ్బు కోవాలి.
2.గోధుమ పిండి, మైదా పిండి లో కొంచం నెయ్యి వేసి , కొంచం నీరు వేసి ,పూరీ పిండి లాగ కలిపి దాని పై ఒక బట్ట వేసి, గంట సేపు నాననివ్వాలి.
3.తరువాత బానలి పెట్టి కొంచం నెయ్యి గాని , లేక నూనె వేసి అందులో జీలకర్ర ,ఇంగువ వేసి, గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు,శెనగలను వేయాలి.
4.కొంచం సేపు ఉడికినాక గరం మసాల , ఉప్పు వేసి బాగ కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
5.తరువాత చల్లగా అయ్యాక చిన్న చిన్న వుండలు చేసుకోవాలి.
6.తరువాత నాన పెట్టిన మైద ,గోధుమ పిండి ని తీసుకొని, పూరీ లా చేసుకొని, అందులో వుండలు గా చేసుకున్నమిశ్రమాన్ని వుంచి నాలుగు వైపులా కప్పాలి.
7.ఇలా చేసుకున్న వాటిని పూరీ లా చేసుకొని నూనె లో వేయించుకోవాలి.
