Website TemplatesJoomla TemplatesWeb Hosting

గుత్తి వంకాయ (Gutti Vankai)

 bangan1

కావలసిన పధార్థాలు:

వంకాయలు ----1/2  కేజి
ఉద్దిపప్పు  ---- 1/4 కప్
శెనగపప్పు ---- 1/4 కప్
వేరు శనగ విత్తనాలు--- 1 కప్
నువ్వులు ---- 1/4 కప్
కొబ్బెర పొడి  ----- 1/4 కప్
ఎండు మిరపకాయలు --- 14
దనియాలు  -----2 స్పూనులు
చింతపండు ----- ఉసిరికాయంత
ఉప్పు -----తగినంత

 

పొడి  చేసుకునే పద్దతి:

1.నువ్వులు , వేరు శనక్కాయలు  విడి  విడి  గా వేయించుకోవాలి.
2.కొంచం నూనె  వేసి, చింతపండు, ఉద్దిపప్పు, శనగపప్పు, వేరు శనక్కాయలు, నువ్వులు కుడా వేసి గ్రైండ్  చేయాలి.
3.నువ్వులు, శనక్కాయ విత్తనాలు , చివరన  గ్రైండ్ చేయాలి. లేకపోతే  పొడి  ముద్దగా అవుతుంది.

కూర చేసుకునే విధానము:

1.వంకాయలు కడిగి,బాగ తుడుచుకోవాలి.కడిగిన వంకాయలు గుండ్రంగా వున్న  చోట  ప్లస్ గా(+) తరుక్కోవాలి .అంటే  తొడిమ  కింద  భాగము నాలుగు భాగాలు గా , పొడి వేయడానికి వీలుగా, అంటే + గా తరుక్కోవాలి.
2.తయారు చేసిన పొడిని, 1/2 టేబుల్ స్పూను  నూనె  వేసి, కొంచము ఉప్పు వేసి, కలుపుకోవాలి.
3.నాలుగు భాగాలు గా  చేసుకు
న్న వంకాయల,తయారు  చేసుకున్న పొడి ని  కూరాలి.
ఇలా అన్ని వంకాయలకు పొడిని కూరుకొని ఉంచుకోవాలి.

bangan

 


4.తరువాత బానలి లో నూనె  వేసి ,  వేడి  అయ్యాక  ఉద్దిపప్పు , శెనగపప్పు, ఆవాలు , జీలకర్ర, కరివేపాకు,ఇంగువ వేసి , తిరగమాత  వేయాలి. కొంచము పసుపు కూడా వేయాలి.
5.తరువాత పొడి నింపిన వంకాయలు  వేసి ,  పైన మూత  పెట్టాలి.అప్పుడప్పుడు వంకాయలు విరగకుండా,మాడకుండా కలుపుతూ వుండాలి.
6.చివరిన  మిగిలిన పొడిని , ఉడికిన వంకాయల పైన వేయాలి. 
అంతే  ఎంతో రుచిగా గుత్తి వంకాయ రెడి .

 

 

 
Comments (6)
6 Sunday, 08 January 2012 15:01
thankyou nice resipi
5 Wednesday, 28 December 2011 03:54
Madhavi
thank you Indira gaaru
4 Tuesday, 20 December 2011 06:09
rayalaseema ruchulu chala manchgunnai
3 Monday, 27 June 2011 16:16
Aruna
gutti vankaya baga vachindandi..thank u
2 Thursday, 21 October 2010 02:40
Madhavi
Thanks you Kam garu.
1 Wednesday, 20 October 2010 11:35
kam
mee rayalaseema ruchulu chala bagunnai

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh