ఇడ్లి (Idli)
|
|
కావలసిన పదార్థాలు: ఇడ్లి రవ---4 కప్స్ఉద్దిపప్పు--- 2 కప్స్ ఉప్పు---తగినంత వంటసోడా---చిటికెడు |
విధానము:
1.ఇడ్లి రవ ,ఉద్దిపప్పు 2 గంటలు విడి విడి గా నానపెట్టుకోవాలి.
2.తరువత నానపెట్టిన ఉద్దిపప్పు గ్రైండ్ చేయాలి.
3.తరువత నానపెట్టిన ఇడ్లిరవ బాగ కడిగి, నీరు లేకుండా గట్టిగా పిండి ఒక గిన్నెలో వేసుకోవాలి.
4.అందులో గ్రైండ్ చేసిన ఉద్దిపప్పు , చిటికెడు వంట సోడా కుడా వేసి బాగ కలిపి
5 లేక 6 గంటలు బయటనే పెట్టాలి.
5.వంట సొడా ఎక్కువ వేయరాదు . వేయక పోయిన పర్లేదు కాని ఎక్కువ మాత్రం వేయరాదు.
6.బయటపెట్టిన ఇడ్లి రవ బాగ పొంగిన తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
7.తరువాత ఇడ్లిస్టాండ్ లో ఇడ్లివేసుకోవాలి.ఇష్టమున్న వారు మిని ఇడ్లి ప్లేట్ లో, చిన్న చిన్న ఇడ్లీలు(పిల్లల కోసం) కూడా వేసుకోవచ్చు.

ఎంతో రుచిగా ఉండే ఇడ్లి రెడి.
ఇడ్లి , సాంబార్ తో గాని , వేరు శెనగపప్పు పచ్చడి, లేక కొబ్బరి పచ్చడి తో తింటే చాలా బాగుంటుంది.
