కేసర్ బూంది లడ్డు(Kesar Boondi Laddu)
![]() |
కావలసిన పదార్థాలు : నూనె ------2 గ్లాసులు(వేయించడానికి) |
విధానము
1.ఒక గిన్నె లో చెక్కర వేసి , చెక్కర మునిగే లా నీరు వేసి తీగ పాకము చేసి పెట్టుకోవాలి.
2.కొద్దిగా పాల్లలో కేసర్ కలర్ కలిపి కలిపి పాకం లో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి
3.నెయ్యి లో జీడిపప్పు, ద్రాక్ష, వేయించు కోవాలి.
4.పాకము లో, వేయించిన జీడిపప్పు ,ద్రాక్ష,ఏలకుల పొడి , పచ్చకర్పూరము వేసి ,పెట్టు కోవాలి.
5.తరువాత నూనె వేడి కు పెట్టు కోవాలి.
6.నూనె వేడి అయ్యెలోపు,శెనగపిండి నీరు వేసి కొంచము జారు గా, బూంది వచ్చేలాగ కలుపుకోవాలి.
7. నూనె కాగక , చిల్లుల గరిట తో బూంది చేసి పాకము లో వేయాలి.
8.పాకము వున్నంత వరకే , బూంది వేయాలి. తరువాత లడ్డు కట్టుకోవాలి.
9.ఒక వేలా బూంది పొడి పొడి గా వుంటే ,కొంచము పాలు వేసుకొవచ్చు.
10. అప్పుడు లడ్డు కట్టడము సులభంగా వస్తుంది.
అంతే ఎంతో రుచి గా వుండే కేసర్ బూందిలడ్డు రెడి.
చిట్కా: పచ్చకర్పూరం కళ్ళవ్యాధులకు, మూత్ర వ్యాధులకు వాడతారు.

