నిమ్మకాయ చిత్రాన్నము (Lemon Rice)
|
|
కావలసిన పదార్ధాలు బియ్యము ------- 2 కప్స్ |
విధానము :
1. 1 గ్లాసుల అన్నము పొడి పొడి గా వాడ్చుకోవాలి.
2. జీడిపప్పు నెయ్యి లో వేయించుకోవాలి.
3. వేరు శెనగ విత్తనాలు కుడా వేయించుకోవాలి.
4 పచ్చిమిర్చ్చి,అల్లము, 1/4 స్పూన్ ఆవాలు గ్రైండ్ చేసుకోవాలి.
5.వేడి వేడి అన్నము లో, పసుపు వేసి ,దానిపైన గ్రైండ్ చేసిన పొడిను , నిమ్మరసము ను వేయాలి.
6. తరువాత బానలి లో నూనె పెట్టి 6 ఎండుమెరపకాయలు ,1/2 స్పూన్ ఉద్దిపప్పు,శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, కరివేపాకు వేయాలి.
7.తరువాత వేయించిన జీడిపప్పు, వేరు శెనగ విత్తనాలు వేసి , బాగా కలిసే లా కలుపుకోవాలి.
8.బాగ కలిపిన తరువాత కొత్తిమెర వేసి ,కొద్ది సేపు మూసి తింటే , అన్నము లో నిమ్మరసం బాగా వూరి రుచిగా వుంటుంది.

