Website TemplatesJoomla TemplatesWeb Hosting

మామిడికాయ చిత్రాన్నము (Mango Rice)

 Mango Rice

కావలసిన పదార్ధాలు:

బియ్యము--3 గ్లాసులు
మామిడికాయ తురుము - 1 కప్
ఆవాలు ---- 1/4 స్పూన్
పచ్చి మిరపకాయలు  -----4 లేక 6
అల్లము ---- చిన్నముక్క
ఉప్పు -- తగినంత
పసుపు----  1/4  స్పూన్
జీడిపప్పు ----10
వేరు శనగ విత్తనాలు ---2 స్పూన్
కరివేపాకు ----2 రెమ్మలు
కొత్తిమీర ---- 2 రెమ్మలు
తిరగమాత గింజలు

విధానము :

1.3 గ్లాసుల అన్నము పొడి పొడి గా వాడ్చుకోవాలి.

2.మామిడికాయను తురుము కోవాలి.(1 కప్ మామిడికాయ తురుము,3 కప్పుల అన్నానికి సరిపోతుంది).

3.జీడిపప్పు నెయ్యి లో వేయించుకోవాలి.

4.వేరుశనగ విత్తనాలు కూడా వేయించుకోవాలి.

5 పచ్చిమిర్చి,అల్లము,1/4 స్పూన్ ఆవాలు గ్రైండ్ చేసుకోవాలి.

6.వేడివేడి అన్నముల,పసుపు వేసి,దానిపైన గ్రైండ్ చేసిన పొడిను,
మామిడికాయ తురుము వేయాలి.

7.తరువాత బానలి లో నూనె పెట్టి 6 ఎండు మిరపకాయలు,1/2 స్పూన్ 
ఉద్దిపప్పు,శనగపప్పు,ఆవాలు, జీలకర్ర,చిటికెడు ఇంగువ,కరివేపాకు వేయాలి.

8.తరువాత వేయించిన జీడిపప్పు, వేరు శనగ విత్తనాలు వేసి,బాగా కలిసేలా కలుపుకోవాలి.

9.బాగ కలిపిన తరువాత కొత్తిమీర వేసి,కొద్ది సేపు మూసి వుంచాలి.

10.కాసేపు అయ్యాక తింటే అన్నము కు,మామిడికాయ రసం బాగా పట్టి,రుచిగా వుంటుంది.

అంతే,ఎంతో రుచి గా వుండే  మామిడికాయ చిత్రాన్నము రెడి.
 
Comments (3)
3 Thursday, 02 February 2012 10:55
lakshmi
Super
2 Monday, 11 April 2011 12:00
super
1 Friday, 04 February 2011 08:31
ravisankar
very nice web site

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh