గోరుచిక్కుడు-ఆలుగడ్డ-వేరుశనగ సాంబార్(Clusterbeans,Potato,Peanut Sambar)
|
|
కావలసిన పదార్థాలు: కంది పప్పు ---- 1 గ్లాసు |
విధానము:
1.కందిపప్పు , తరిగి ఉంచిన గోరుచిక్కుడు కాయలు, ఆలుగడ్డ ముక్కలు, వేరుశనగపప్పు బాగ కడిగి, కుక్కర్ లో పెట్టి 2 విసిల్స్ రానివ్వాలి.
2.తరువాత గిన్నె పెట్టి, కొంచం నూనె వేసి, ఉద్దిపప్పు, శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పసుపు , చెక్క, వేసి తాలింపు పెట్టుకోవాలి.
3.తరువాత అందులోకి ఉడికించిన పప్పు, వేరు శనక్కాయలు ,ఉర్లగడ్డలు, గోరుచిక్కుడు కాయలు, కొంచం నీరు పోసి జారుగా చేసుకోవాలి.
4.తరువాత సాంబార్ పొడి వేసి ,తగినంత ఉప్పు ,చింతపండు పులుసు వేసి , బాగ మరగ నివ్వాలి.
5.చివరి లో పచ్చి కొబ్బెర , కొత్తిమీర ,కరివేపాకు వేసి, స్టవ్ ఆఫ్ చేయాలి.
ఎంతో రుచిగా వుండే గోరుచిక్కుడు -ఆలుగడ్డ-వేరుశనగ సాంబార్ రెడి.

