Website TemplatesJoomla TemplatesWeb Hosting

వంకాయ ఆలుగడ్డ కూర (Brinjal-Potato Curry)

 Baingan Curry

కావలసిన పదార్థాలు:

వంకాయలు---5

ఆలు గడ్డలు--2

ఎర్ర కారం--1/2 స్పూన్

వేరు శనక్కాయలు---1/4 కప్

నువ్వులు---1/4 స్పూన్

ఉప్పు---తగినంత

తిరగమాత గింజలు:(అన్నీ1/4 స్పూన్)

ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర

ఇంగువ--చిటికెడు

విధానము:

1.వేరుశనక్కాయలు,నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి.

2.వంకాయలు,ఆలుగడ్డలు బాగా కడిగి, చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

3.బానలి పెట్టి,2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు వేసుకోవాలి.

4.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, ఆలుగడ్డ ముక్కలు వేయాలి.

5.కొంచం ఆలు గడ్డలు వేగినాక, వంకాయలు వేసి బాగా కలిపి, మూత పెట్టాలి.

6.వంకాయలు,ఆలుగడ్డలు బాగా ఉడికినాక, వేరు శనక్కాయల పొడి, నువ్వుల పొడి, ఎర్ర కారం ,ఉప్పు వేసి బాగా కలపాలి.

7.చివరిలో కొత్తిమీర ,కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .

ఎంతో రుచిగా ఉండే వంకాయ-ఆలుగడ్డ కూర రెడి. కూర అన్నంలోకి, చపాతి లోకి బాగుంటుంది.
 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh