Website TemplatesJoomla TemplatesWeb Hosting

కాప్సికం-ఆలుగడ్డ-బఠానీ కూర (Capsicum Potato Peas Curry )

 

alu-cap-peasకావలసిన పదార్థాలు
(ముగ్గురికి సరిపడా)
:
ఆలు గడ్డలు--2
కాప్సికం--2
పచ్చి బఠానీలు---1/4 కప్
ఎర్ర కారం--1/2 స్పూన్
వేరు శనక్కాయలు---1/4 కప్
నువ్వులు---1/4 స్పూన్
ఉప్పు---తగినంత
కొబ్బెర---2 స్పూన్స్
తిరగమాత గింజలు:(అన్నీ1/4 స్పూన్)
ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర
చెక్క--2 పీసెస్
ఇంగువ--చిటికెడు

విధానము:

1.వేరుశనక్కాయలు,నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి.

2.కాప్సికం,వంకాయలు,ఆలుగడ్డలు బాగా కడిగి, చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

3.బానలి పెట్టి,2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు, దాల్చిన్ చెక్క వేసుకోవాలి.

4.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, ఆలుగడ్డ ముక్కలు వేయాలి.

5.కొంచం ఆలు గడ్డలు వేగినాక, కాప్సికం,నానపెట్టిన పచ్చి బఠానీలు వేసి బాగా కలిపి, మూత పెట్టాలి.

6.కాప్సికం,ఆలుగడ్డలు బాగా ఉడికినాక, వేరు శనక్కాయల పొడి, నువ్వుల పొడి, ఎర్ర కారం ,కొబ్బెర, ఉప్పు వేసి బాగా కలపాలి.

7.చివరిలో కొత్తిమీర ,కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .

ఎంతో రుచిగా ఉండే కాప్సికం-ఆలుగడ్డ-బఠానీ కూర రెడి. ఈ కూర అన్నం లోకి ,చపాతి లోకి బాగుంటుంది .
 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh