కాప్సికం వెజిటబుల్ కూర (Capsicum Veg Curry )
|
|
|
విధానము:
1.వేరుశనక్కాయలు,నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి.2.కాప్సికం,కారెట్,ఆలుగడ్డలు బాగా కడిగి, చిన్న ముక్కలు గా చేసుకోవాలి.
3.బానలి పెట్టి,2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు ,దాల్చిన్ చెక్క, లవంగాలు, ఏలకులు వేయాలి..
4.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, ఆలుగడ్డ ముక్కలు వేయాలి.
5.కొంచం ఆలు గడ్డలు వేగినాక, కారెట్, కాప్సికం, నానపెట్టిన పచ్చి బఠానీలు వేసి బాగా కలిపి, మూత పెట్టాలి.
6. కూరలు అన్నీ వేగినాక, వేరు శనక్కాయల పొడి, నువ్వుల పొడి, ఎర్ర కారం ,కొబ్బెర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
7.చివరిలో కొత్తిమీర , కరివేపాకు, జీడిపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .
ఎంతో రుచిగా ఉండే కాప్సికం-వెజిటబుల్ కూర రెడి. ఈ కూర అన్నం లోకి ,చపాతి లోకి బాగుంటుంది
కావలసిన పదార్థాలు