ఆలుగడ్డ-ఉల్లిపాయ-టమొటా కూర (Alu Onion Tomato Curry )
|
|
కావలసిన పదార్థాలు (ముగ్గురికి సరిపడా): |
విధానము:
1.ఆలుగడ్డలు బాగా కడిగి, ఉడికించి, చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
2.ఉల్లిపాయలు,టమొటా,అల్లం,పచ్చి మిర్చి చిన్న ముక్కలు గా తరిగి ఉంచుకోవాలి.
3.బానలి పెట్టి,2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు వేసుకోవాలి.
4.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి.
5.ఉల్లిపాయలు కొంచం వేగినాక పచ్చి మిర్చి, టమొటా, అల్లం, వేసి బాగా వేయించాలి.
6.తరువాత ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు వేయాలి.
7.తరువార ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి, (కారం ఎక్కువ కావాలనుకుంటే ఎర్ర కారం వేసుకోవచ్చు).
8.చివరిలో కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .
ఎంతో రుచిగా ఉండే ఆలుగడ్డ-ఉల్లిపాయ-టమొటా కూర రెడి. ఈ కూర అన్నం /చపాతి/పూరీకి బాగుంటుంది.
