Website TemplatesJoomla TemplatesWeb Hosting

సొరకాయ కూర (Bottle Gourd Curry )

 bottlegourd curry

కావలసిన పదార్థాలు:

సొరకాయ---1
ఎర్ర కారం--1/2 స్పూన్
వేరు శనక్కాయలు---1/4 కప్
నువ్వులు---1/4 స్పూన్
ధనియాల పొడి---1/4 స్పూన్
జీలకర్ర పొడి--1/4 స్పూన్
ఉప్పు---తగినంత
కొబ్బెర---2 స్పూన్స్
తిరగమాత గింజలు:(అన్నీ 1/4 స్పూన్)
ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర
చెక్క--2 పీసెస్
ఇంగువ--చిటికెడు

విధానము:

1.వేరుశనక్కాయలు,నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి.

2.సొరకాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

3.బానలి పెట్టి, 2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు, దాల్చిన్ చెక్క వేయాలి.

4.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, సొరకాయ ముక్కలు వేయాలి.

5.సొరకాయ ముక్కలన్నీ బాగా వేగినాక, వేరు శనక్కాయల పొడి, నువ్వుల పొడి, ఎర్ర కారం ,కొబ్బెర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

6.చివరిలో కొత్తిమీర ,కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .

ఎంతో రుచిగా ఉండే సొరకాయ  కూర రెడి. ఈ కూర అన్నం లోకి, చపాతి లోకి బాగుంటుంది.   

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh