Website TemplatesJoomla TemplatesWeb Hosting

క్యాబేజి-ఆలుగడ్డ కూర (Cabbage Potato Curry )

 

cabage fry 

కావలసిన పదార్థాలు (నలుగురికి సరిపడా):

క్యాబేజి ---1
ఆలు గడ్డలు----2
పచ్చి మిర్చి---3
అల్లం-- చిన్న ముక్క
ఎర్ర కారం--1/2 స్పూన్
జీలకర్ర పొడి--1/4 స్పూన్
ఉప్పు---తగినంత
తిరగమాత గింజలు:(అన్నీ 1/4 స్పూన్)
ఉద్దిపప్పు,శెనగపప్పు,ఆవాలు,జీలకర్ర 
ఇంగువ--చిటికెడు

విధానము:

1. క్యాబేజి, ఆలుగడ్డలు , మిర్చి, అల్లం చిన్నగా తరిగి ఉంచుకోవాలి.

2.బానలి పెట్టి,2 లేక 3 స్పూన్స్ నూనె వేసి తిరగమాత గింజలు వేయాలి.

3.ఆవాలు చిట చిట అన్నాకా, ఇంగువ వేసి, చిన్నగా తరిగిన ఆలుగడ్డలు వేయాలి.

4.ఆలుగడ్డలు కొంచం వేగినాక, క్యాబేజి మిర్చి, అల్లం ముక్కలు వేసి మూత పెట్టాలి.

5.కాబేజి,ఆలుగడ్డలు బాగా వేగినాక, కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

6.చివరిలో కొత్తిమీర , కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .

ఎంతో రుచిగా ఉండే క్యాబేజి - ఆలుగడ్డ కూర రెడి. ఈ కూర అన్నం లోకి ,చపాతి లోకి బాగుంటుంది.  

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh