పాలకూర పప్పు(Spinach Dal)
|
|
కావలసిన పదార్థాలు: పాలకూర—1 కట్ట పచ్చి మిర్చి---4 చింతపండు రసం--1/2 పసుపు--1/4 స్పూన్ తిరగమాత గింజలు:(అన్నీ 1/4 స్పూన్) ఉద్దిపప్పు, శనగ పప్పు, ఆవాలు) ఉప్పు--తగినంత |
విధానము:
1.కందిపప్పు బాగా కడిగి కుక్కర్ లో పెట్టి ఉడికించాలి..
2.పచ్చి మిర్చి, పాలకూర చిన్నగా తరిగి ఉంచుకోవాలి.
3.బానలి లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక తిరగమాత వేసుకోవాలి.
4.తరువాత కట్ చేసిన పచ్చి మిర్చి పాలకూర వేసి వేయించాలి.
5. పాలకూర బాగా వేగినాక, ఉడికించిన కంది పప్పు వేయాలి.
6.తరువాత చింతపండు పులుసు, పసుపు, ఉప్పు వేయాలి.
7.తరువాత మిశ్రమం అంతా బాగా కలిసేలా 5 నిముషాలు ఉడికించాలి.
8.తరువాత కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఎంతో రుచిగా ఉండే పాలకూర పప్పు రెడి. ఇది అన్నం తో బాగుంటుంది.
గమనిక: కంది పప్పుతో పాటు పాలకూర కూడా ఉడికించుకోవచ్చు.
ఇష్టమున్న వారు ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు.
చిట్కా: పాలకూర అరోగ్యానికి ఎంతో మంచిది. కాని పాలకూరలో టమొటా వాడడం వల్ల కిడ్నీ లో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది.
