Website TemplatesJoomla TemplatesWeb Hosting

దోసకాయ పప్పు(Cucumber Dal)

dosakaya pappu 

కావలసిన పదార్థాలు:

దోసకాయ---2
టమొటా--2
కంది పప్పు---1 కప్
పచ్చి మిర్చి---4
చింతపండు రసం--1/2
పసుపు--1/4 స్పూన్
తిరగమాత గింజలు:(అన్నీ1/4 స్పూన్)
(ఉద్దిపప్పు, శనగ పప్పు, ఆవాలు)
ఉప్పు--తగినంత

విధానము:

1.దోసకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2.పచ్చి మిర్చి, టమొటా కూడా చిన్నగా తరిగి ఉంచుకోవాలి.

3.కందిపప్పు బాగా కడిగి కుక్కర్ లో పెట్టి ఉడికించాలి.

4.బానలి లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక తిరగమాత వేసుకోవాలి.

5.తరువాత కట్ చేసిన దోసకాయ, టమొటా, పచ్చి మిర్చి వేసి వేయించాలి.

6.దోసకాయ బాగా ఉడికినాక, ఉడికించిన కంది పప్పు వేయాలి.

7.తరువాత చింతపండు పులుసు, పసుపు, ఉప్పు వేయాలి.

8.తరువాత మిశ్రమం అంతా బాగా కలిసేలా  5 నిముషాలు ఉడికించాలి.

9.తరువాత కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు రెడి. ఇది అన్నం/చపాతి తో బాగుంటుంది.

గమనిక: కంది పప్పుతో పాటు దోసకాయ, పచ్చి మిర్చి, టమొటా, కూడా ఉడికించుకోవచ్చు.

 

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh