Website TemplatesJoomla TemplatesWeb Hosting

మామిడికాయ పప్పు(Raw Mango Dal)

mango pappu 

కావలసిన పదార్థాలు:

మామిడికాయ--1
పచ్చి మిర్చి--5
కంది పప్పు--1 కప్
చెక్కర--1/2 స్పూన్
వెల్లుల్లి--2 లేక 4
పసుపు-1/2 టీ స్పూన్
ఎర్ర కారం--1 టీ స్పూన్
తిరగమాత గింజలు(అన్ని1/2 టీ స్పూన్)
(ఉద్దిపప్పు, ఆవాలు)
ఇంగువ--చిటికెడు
ఉప్పు--తగినంత

విధానము:

1.మామిడికాయ చెక్కు తీసి, చిన్నగా ముక్కలు చేసుకోవాలి.

2.ఒక గిన్నె లో కంది పప్పు బాగా కడిగి,2 కప్స్ నీరు వేయాలి.

3.తరువాత కంది పప్పు వేసిన గిన్నెలో, కట్ చేసిన పచ్చి మిర్చి, మామిడికాయ ముక్కలు వేసి కుక్కర్ లో పెట్టి 3 విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.

4.తరువాత బానలిలో నూనె వేసి ,వేడి అయ్యాక తిరగమాత గింజలు, వెల్లుల్లి, ఇంగువ వేయాలి.

5.తిరగమాత గింజలు వేగినాక, ఉడికించిన మామిడికాయ పప్పు వేసి కొద్దిగా నీరు వేసి బాగా కలపాలి.

6.తరువాత ఎర్ర కారం, పసుపు ,ఉప్పు, కొద్దిగా చెక్కర  వేసి 5 లేక్ 7 నిముషాలు ఉడికించాలి.

ఎంతో రుచిగా ఉండే నోరూరించే మామిడికాయ పప్పు రెడి.దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.

గమనిక: ఇష్టమున్న వారు పప్పులో  మామిడికాయ  టెంక కూడా వేసుకోవచ్చు. 
 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh