Website TemplatesJoomla TemplatesWeb Hosting

టమొటాకాయ పప్పు(Tomato Dal)

green tomoto 

కావలసిన పదార్థాలు:

టమొటకాయలు—4
కంది పప్పు---1 కప్
ఉల్లిపాయ--1
పచ్చి మిర్చి---4
చింతపండు రసం--1/2
పసుపు--1/4 స్పూన్
తిరగమాత గింజలు:(అన్నీ1/4 స్పూన్)
ఉద్దిపప్పు, శనగ పప్పు, ఆవాలు)
ఉప్పు--తగినంత

విధానము:

1.టమొట కాయలు  బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2.పచ్చి మిర్చి, ఉల్లిపాయ కూడా చిన్నగా తరిగి ఉంచుకోవాలి.

3.కందిపప్పు బాగా కడిగి కుక్కర్ లో పెట్టి ఉడికించాలి.

4.బానలి లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక తిరగమాత వేసుకోవాలి.

5.తరువాత కట్ చేసిన పచ్చి మిర్చి , ఉల్లిపాయ, టమొటా వేసి వేయించాలి.

6. టమొటా బాగా ఉడికినాక, ఉడికించిన కంది పప్పు వేయాలి.

7.తరువాత చింతపండు పులుసు, పసుపు, ఉప్పు వేయాలి.

8.తరువాత మిశ్రమం అంతా బాగా కలిసేలా  5 నిముషాలు ఉడికించాలి.

9.తరువాత కొత్తిమీర, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఎంతో రుచిగా ఉండే టమొటాకాయ పప్పు రెడి. ఇది అన్నం తో బాగుంటుంది.

గమనిక: కంది పప్పుతో పాటు కూరలు కూడా ఉడికించుకోవచ్చు.

green tamoto dal

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh