Website TemplatesJoomla TemplatesWeb Hosting

తోటకూర పులుసు(Totakura Pulusu)

totakura pulusu  

కావలసిన పదార్థాలు:

 తోటకూర --- 1 కట్ట
టమొటా --1
శనగ పప్పు--1/2 కప్
పచ్చి మిర్చి---6
చింతపండు పేస్ట్ --1/2 స్పూన్
పసుపు---చిటికెడు
ఇంగువ---చిటికెడు
బియ్యప్పిండి--1 స్పూన్
ఉప్పు--తగినంత
మెంతులు--1 స్పూన్
ఎర్ర కారం -- 1/2 స్పూన్
నూనె -- 2 స్పూన్స్

విధానము:

1. తోటకూర కాడలు లేకుండా తీసి బాగా శుభ్రం చేసుకోవాలి.

2.టమొటా,తోటకూర,పచ్చి మిర్చి చిన్న గా కట్ చేసుకోవాలి.

3.తరువాత కుక్కర్ గిన్నె లో శనగ పప్పు వేసి బాగా కడిగి అందులో, కట్ చేసిన తోటకూర, టమొటా, పచ్చి మిర్చి వేసి,1 కప్(తగినంత నీరు) నీరు వేసి మూత పెట్టాలి.

4.తరువాత 3-4 విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.

5.తరువాత ఒక గిన్నె లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

6.నూనె వేడి అయ్యాక మెంతులు, ఆవాలు, ఎండు మిర్చి వేసి కొద్దిగా వేయించాలి.

7.తరువాత ఉడికించిన పప్పు, తోటకూర జాగ్రత్తగా వేసి కలపాలి.

8.ఒక చిన్న గిన్నె లో 1/2కప్ నీళ్ళు తీసుకొని దానిలో బియ్యప్పిండి వేసి, ఉంటలు లేకుండా కలిపి, ఉడుకుతున్న తోటకూర పులుసులో వేసి 5 నిముషాలు ఉడికించాలి.

9.తరువాత చింతపండు పులుసు, పసుపు, ఎర్ర కారం, ఉప్పు వేసి 3-4 నిముషాలు ఉడికించాలి.

ఎంతో రుచిగా ఉండే తోటకూర పులుసు రెడి. ఇది అన్నంతో తింటే చాలా  బాగుంటుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh