Website TemplatesJoomla TemplatesWeb Hosting

పొంగలి (Pongali)

pongali1 

కావలసిన పదార్థాలు:

బియ్యము ---- 1 గ్లాసు
పెసరపప్పు---- 1 గ్లాసు
పచ్చి మిర్చ్చి ---- 3
అల్లము  ----చిన్న ముక్క
జీలకర్ర  ----1/2 స్పూన్
మిరియాలు --1/2 స్పూన్
కరేపాకు ----7లేక 10
ఉప్పు ----తగినంత
నెయ్యి --- 3 స్పూన్
జీడి పప్పు ---  8 లెక 10
పోపు గింజలు (1/2 స్పూన్ అన్నీ )
ఆవాలు,ఉద్దిపప్పు,జీలకర్ర)

విధానము:

1.పచ్చిమిర్చి,అల్లము చిన్నగా తరిగి వుంచుకోవాలి.
2. తరువాత ఒక గిన్నెలో బియ్యము,పెసరపప్పు వేసి 4 గ్లాసులు నీరు వేయాలి.
3. అందులో కి   చిన్నగా  తరుకొన్న పచ్చి మిర్చి , అల్లము , 1/2 స్పూన్ మిరియాలు ,
1/2 స్పూన్ జీలకర్ర  , 1/4 స్పూన్  పసుపు , ఉప్పు వేసి , కుక్కర్ లో పెట్టుకోవాలి.
2 విసిల్స్ వచ్చాక  , స్టవ్ కట్టెయాలి. (పొంగలి తెల్లగా వుండాలి అనుకునే వారు పసుపు వేయనక్కర లేదు).
4 .తరువాత బానలి  పెట్టి ,  కొంచం నెయ్యి వేసి ,  జీడిపప్పు వేయించుకొని  పక్కన  పెట్టుకోవాలి.
5.తరువాత ఉద్దిపప్పు,ఆవాలు జీలకర్ర ,కరేపాకు,ఇంగువ వెసి తిరగమాత వేసుకోవాలి.
6. తరువాత కుక్కర్ లో నుంచి  ఉడికించిన  అన్నము+పెసరపప్పు  ను ,
 ఒక గిన్నలో వేసి , నెయ్యి లో వేయించిన జీడిపప్పు, తిరగమాత వేసి బాగా కలపాలి.
7. ఉప్పు తక్కువ ఐతే వేసుకోవాలి.
8.ఒక వేల పొంగలి గట్టిగా వుంటే కొంచం నీరు వేసుకొని కొంచం సేపు వుడికించుకోవాలి. అప్పుడు జారుగా వుంటుంది.

అంతే ఎంతో రుచిగా ఉండే   పొంగలి రెడి . ఇందులోకి పప్పుల పచ్చడి బాగుంటుంది.
 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh