Website TemplatesJoomla TemplatesWeb Hosting

వెజిటబుల్ బిరియాని (Vegetable Biryani)

 

Pulav

కావలసిన పధార్థాలు:

బాస్మతి రైస్ ----3 కప్స్
ఉల్లిపాయ ----1
టమొట -----1
కారెట్ ----1
ఉర్లగడ్డ ----1
బేన్స్ ----- 10
పచ్చి బఠానీలు ---1/4 కప్
పచ్చి కొబ్బెర -----1/2 కప్
పచ్చి మిర్చి ----4
పుదీన ---- 1 చిన్న కట్ట
కొత్తిమెర --- 1/4 కట్ట
చెక్క ---- 1"
లవంగాలు ---- 3
జావెత్రి ---2
బేలివ్స్(బిరియాని ఆకులు) ----3
జీరపొడి ---- 1 స్పూన్
దనియ పొడి -----1 1/2 స్పూన్
గరం మసాల --- 1/2 స్పూన్
అల్లం,వెల్లుల్లి పేస్ట్ ---2 స్పూన్స్
నూనె-----1 స్పూన్
నెయ్యి---- 1స్పూ

విధానము:

1.బాస్మతి బియ్యం  బాగ కడిగి 30 నిముషాలు నానపెటాలి.
2.పుదీన ,కొత్తిమీర,పచ్చి మిర్చి,పచ్చి కొబ్బెర ,అల్లం,వెల్లులి పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి.  
3.కూరలు అన్నీ, చిన్నగా తరిగి వుంచుకోవాలి.
4.బానలి పెట్టి నూనె,నెయ్యి వేసి వేడి అయ్యాక ,అందులో చెక్క ,లవంగాలు,యాలక్కులు ,జావెత్రి, బెలివ్స్(బిరియాని ఆకులు) వేయాలి. 
5.అందులోకి తరిగిన ఉల్లిపాయలు,అల్లం వెల్లుల్లి పెస్ట్ వేసి ఎర్రగా వేయించాలి.
6.తరువాత గ్రైండ్ చేసిన పేస్ట్ , తరిగిన కూరలు  కూడ వేసి 5 నిముషాలు  వేయించాలి.
7.తరువాత అందులోకి పుదీన,కొత్తిమిర ,దనియా పొడి,జీర పొడి,గరం మసాల, వేసి 2 నిముషాలు వేయించాలి.
8.అందులోకి , కడిగిన  బాస్మతి బియ్యం  వేసి 1 నిముషం వేయించాలి.
9.తరువాత కుకర్  పెట్టి వెయించిన బాస్మతి బియ్యం+కూరలు వేసి నీరు వేయాలి.  (బాస్మతి బియ్యం కు 1 కప్ కు 1 1/2 నీరు వెయాలి.1 కి 2 నీరు వేస్తే అన్నము ముద్దగా అవుతుంది)
10.తరువాత తగినంత ఉప్పు వేసి,కుక్కర్ మూత పెట్టి  2 విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.
11.చివరి లో పులావ్  పైన , 1 స్పూన్  కుంకుమ పువ్వు నీరు  వేస్తే  ఎంతో రుచిగా ,కలర్ ఫుల్ గా ఉంటుంది.

నోరూరించే  వెజిటబుల్  బిరియాని  రెడీ.  ఈ అన్నము , రైతా తో తింటే చాల బాగుంటుంది.
 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh