నిమ్మకాయ ,కొబ్బెర చిత్రాన్నము (Lemon -Coconut Rice)
|
|
కావలసిన పదార్ధాలు: బియ్యము --1 గ్లాసు |
విధానము :
1.1 గ్లాసుల అన్నము పొడి పొడి గా వాడ్చుకోవాలి.
2.జీడిపప్పు నెయ్యి లో వేయించుకోవాలి.
3.వేరు శెనగ విత్తనాలు కుడా వేయించుకోవాలి.
4 పచ్చి కొబ్బెర ,పచ్చిమిర్చ్చి,అల్లము, 1/4 స్పూన్ ఆవాలు గ్రైండ్ చేసుకోవాలి.
5.వేడి వేడి అన్నము లో , పసుపు వేసి ,దానిపైన గ్రైండ్ చేసిన పొడిను , నిమ్మరసము ను వేయాలి.
6.తరువాత బానలి లో నూనె పెట్టి 6 ఎండుమెరపకాయలు ,1/2 స్పూన్ ఉద్దిపప్పు,శెనగపప్పు, ఆవాలు , జీలకర్ర, చిటికెడు ఇంగువ, కరేపాకు వేయాలి.
7.తరువాత వేయించిన జీడిపప్పు, వేరు శెనగ విత్తనాలు వేసి , బాగా కలిసే లా కలుపుకోవాలి.
8.బాగ కలిపిన తరువాత కొత్తిమెర వేసి ,కొద్ది సేపు మూసి తింటే , అన్నము లో నిమ్మరసం బాగా వూరి రుచిగా వుంటుంది.
అంతే ఎంతో రుచి గా వుండే నిమ్మకాయ-కొబ్బెర చిత్రాన్నము రెడి.

