Website TemplatesJoomla TemplatesWeb Hosting

మెంతి చింతపండు పులిహోర (Methi-Tamarind Pulihora)

 tamarin-pulihora

కావలసిన పదార్ధాలు

చింతపండు---గుప్పెడు
పచ్చిమిర్చి---5 లేక 7
బెల్లం----ఉసిరికాయంత
పసుపు---1 స్పూన్
ఉప్పు---- తగినంత
ఇంగువ---1/2 స్పూన్
జీడిపప్పు---10-15
మెంతి పొడి---1 స్పూన్
తిరగమాత గింజలు:
శెనగపప్పు --1స్పూన్
ఉద్దిపప్పు---1స్పూన్
ఆవాలు---1 స్పూన్
జీలకర్ర---1 స్పూన్
ఎండు మిరప కాయలు---5-7
కరివేపాకు---10 ఆకులు
నూనె---2 గరిటలు

*ముందుగా బానలి పెట్టి 3 స్పూన్స్ నూనె వేసి,వేడి అయ్యాక తిరగమాత గింజలు వేయాలి.ఆవాలు చిట చిట అన్నాకా,1 స్పూన్ మెంతి పొడి వేసి బాగా కలిపి,స్టవ్ ఆఫ్ చేసి  పక్కన పెట్టుకోవాలి.
*జీడిపప్పు నెయ్యి లో వేయించుకోవాలి.

విధానము :

1.బియ్యము బాగ కడిగి, 6 కప్స్ నీళ్ళు వేసి, కుకర్ లో పెట్టి ,  2 విసిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి.(అన్నము పొడి పొడి గా వుంటే బాగుంటుంది).

2.చింతపండు 1 గంట నానపెట్టాలి.

3.నానపెట్టిన చింతపండు గుజ్జు గా చేసి,  ఒక గిన్నె లో పెట్టుకోవాలి.

4.బానలి పెట్టి,1 గరిట నూనె వేసి ,నూనె వేడి అయ్యాక,తరిగిన  పచ్చిమిర్చి,ఎండు మిరపకాయలు,ఇంగువ ,చింతపండు  గుజ్జు వేసి ,బాగ ఉడకనివ్వాలి.

5.చింతపండు గుజ్జు ,ఉడికి  ఉడికి,చిక్కబడుతుంది.(వేసుకున్న గుజ్జు కన్న1/3 వంతు తక్కువ అవుతుంది) చింతపండు రంగు కూడ కొంచం నల్లగా మారుతుంది.

6.ఇలా చిక్కగా ఐన గుజ్జులో,పసుపు,తగినంత ఉప్పు,బెల్లము వేసి 5 నిముషాలు ఉడకనిచ్చి,స్టవ్ ఆఫ్ చేయాలి.

7.బేసన్ (పెద్ద గిన్నె)లో ఉడికిన పొడి పొడి అన్నము వేసి,2 స్పూన్స్ నూనె వేసి, బాగా కలపాలి.

8.తరువాత ఉడికించిన గుజ్జు,పక్కన పెట్టుకున్నమెంతి పొడి వేసిన  తిరగమాత గింజలు, నెయ్యి లోవేయించిన జీడిపప్పు వేసి, బాగా కలపాలి.

9.ఉప్పు తక్కువ ఐతే కలుపుకోవాలి.

అంతే  ఎంతో రుచిగా వుండే మెంతి -చింతపండు పులిహోర రెడి.

చిట్కా: మెంతులు దేహానికి చలువ  చేస్తుంది. తిరగమాత లో వేసుకుంటే  మంచి వాసన తో పాటు ,రుచిగా కూడా ఉంటుంది. అలా అని ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది.

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh