నువ్వు పప్పు చింతపండు పులిహోర (Sesame Pulihora)
|
|
కావలసిన పదార్ధాలు చింతపండు---గుప్పెడు |
విధానము :
*ముందుగా బానలి పెట్టి 3 స్పూన్స్ నూనె వేసి,వేడి అయ్యాక తిరగమాత గింజలు వేయాలి.ఆవాలు చిట చిట అన్నాకా,1 స్పూన్ మెంతి పొడి వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
*జీడిపప్పు నెయ్యి లో వేయించుకోవాలి.
1.బియ్యము బాగా కడిగి, 6 కప్స్ నీళ్ళు వేసి, కుకర్ లో పెట్టి , 2 విసిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి.(అన్నము పొడి పొడి గా వుంటే బాగుంటుంది).
2.చింతపండు 1 గంట నానపెట్టాలి.
3.నానపెట్టిన చింతపండు గుజ్జు ,గా చేసి ఒక గిన్నె లో పెట్టుకోవాలి.
4.బానలి పెట్టి,1 గరిట నూనె వేసి ,నూనె వేడి అయ్యాక, తరిగిన పచ్చి మిర్చి, ఎండు మిరపకాయలు
,ఇంగువ ,చింతపండు గుజ్జు వేసి ,బాగా ఉడకనివ్వాలి.
5.చింతపండు గుజ్జు , ఉడికి ఉడికి, చిక్కబడుతుంది.(వేసుకున్న గుజ్జు కన్నా 1/3 వంతు తక్కువ అవుతుంది) చింతపండు రంగు కూడ కొంచం నల్లగా మారుతుంది.
6.ఇలా చిక్కగా ఐన గుజ్జు లో, పసుపు, తగినంత ఉప్పు, బెల్లము వేసి 5 నిముషాలు ఉడకనిచ్చి, స్టవ్ ఆఫ్ చేయాలి.
7.బేసన్ (పెద్ద గిన్నె)లో ఉడికిన పొడి పొడి అన్నము వేసి,2 స్పూన్స్ నూనె వేసి, బాగా కలపాలి.
8.తరువాత ఉడికించిన గుజ్జు, పక్కన పెట్టుకున్న నువ్వు పొడి వేసిన తిరగమాత గింజలు, నెయ్యి లో వేయించిన జీడిపప్పు వేసి, బాగా కలపాలి.
9.ఉప్పు తక్కువ ఐతే కలుపుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే నువ్వుల చింతపండు పులిహోర రెడి .
చిట్కా: నువ్వులు దేహానికి వేడి చేస్తుంది. తక్కువ వాడితే మంచిది.

