Website TemplatesJoomla TemplatesWeb Hosting

కొత్తిమీర –పుదీన పులావ్(Coriander-Mint Pulav)

 Coriander-Mint  Pulav

కావలసిన పదార్థాలు:

బాస్మతి బియ్యం---3 కప్స్
కొత్తిమీర ఆకులు---1 కప్
పుదీన---1 కప్
పచ్చి కొబ్బెర తురుము--1/2 కప్
అల్లం వెల్లుల్లి పేస్ట్--1 స్పూన్
సోంప్-1 స్పూన్
పచ్చి మిర్చి---4 లేక 6
ఉప్పు--తగినంత
తిరగమాత గింజలు:
నూనె--1 స్పూన్
నెయ్యి---1 స్పూన్
లవంగాలు---3
దాల్చిన్ చెక్క ముక్కలు--3
ఏలకులు---3
బిర్యాని ఆకులు--3
కూరలు:
పచ్చి బఠానీలు---1/4 కప్
కారెట్ ముక్కలు--1/4 కప్
ఆలుగడ్డ---1
ఉల్లిపాయ---1

విధానము:

 

1.కొత్తిమీర,పుధీన, కారెట్ బాగా కడగాలి.

2.మిక్సీ జార్ లో, పుదీన, కొత్తిమీర, పచ్చి మిర్చి, సోంపు, పచ్చి కొబ్బెర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.

3.ఆలుగడ్డ,కారెట్,ఉల్లిపాయ చిన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి.

4.బానలి లో నూనె, నెయ్యి వేసి, వేడి అయ్యాక  లవంగాలు, ఏలకులు, దాల్చిన్ చెక్క ముక్కలు, బిర్యాని ఆకులు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి  వేగనివ్వాలి.

5.తరువాత ఉల్లిపాయలు వేసి ఒక నిముషం  వేగనిచ్చి, ఆలుగడ్డ ముక్కలు, కారెట్ ముక్కలు ,పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి.

6.తరువాత గ్రైండ్ చేసిన కొత్తిమీర -పుదీన  పేస్ట్ వేయాలి.

7.తరువాత బాస్మతి బియ్యం బాగా కడిగి, వేయించిన మసాలలో వేసి 2 నిముషాలు వేయించాలి. ఒక కప్ నీరు వేసి

కొద్ది  సేపు  మసాల+బియ్యం ఉడకనివ్వాలి.

8.తరువాత తయారు చేసుకొన్న మిశ్రమాన్ని అంతా కుక్కర్ లో  వేసి, 3 కప్స్ నీరు వేసి ,తగినంత ఉప్పు వేసి 2 విసిల్స్ వచ్చేదాక  ఉంచాలి.

9.3 కప్స్ బాస్మతి బియ్యానికి, 41/2 కప్ నీరు వేయాలి. కూరలలో నీరు ఉన్నందున  మనం 1/2 కప్ తగ్గించి 4 కప్స్ నీరు వేసాము.  కాబట్టి అన్నం ముద్దగా కాకుండా పొడిగా ఉంటుంది.

ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర-పుదీన పులావ్ రెడి. దీన్ని రైతా తో తింటే చాలా బాగుంటుంది.  
 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh