రవ పులిహోర/పిండి పులిహోర (Rava /Pindi Pulihora)
|
|
కావలసిన పధార్థాలు: బియ్యము---3 కప్స్ |
*ముందుగా బానలి పెట్టి 3 స్పూన్స్ నూనె వేసి, వేడి అయ్యాక తిరగమాత గింజలు వేయాలి. ఆవాలు చిట చిట అన్నాకా, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
*జీడిపప్పు నెయ్యి లో వేయించుకోవాలి
విధానము:
1.బియ్యము బాగా కడిగి, బట్టపై 30 నిముషాలు ఆరనివ్వాలి.
2.తరువాత మిక్సీ లో ఆరపెట్టిన బియ్యంను బరకగా(మెత్తగా కాకుండా)రవలాగ గ్రైండ్ చేయాలి.
3. తరువాత గ్రైండ్ చేసిన రవలో 1/2 స్పూన్ నూనె, తగినంత నీరు వేసి కుక్కర్ లో పెట్టి ఉడికించాలి.(1 కప్ రవకు 2 కప్స్ నీరు). నూనె వేయడం వల్ల రవ ముద్దగా కాకుండా పొడి పొడి గా ఉంటుంది.
4. చింతపండు 1 గంట నాన పెట్టాలి.
5.నానపెట్టిన చింతపండు గుజ్జు గా చేసి ఒక గిన్నె లో పెట్టుకోవాలి.
6.బానలి పెట్టి, 1 గరిట నూనె వేసి ,నూనె వేడి అయ్యాక, తరిగిన పచ్చి మిర్చి, ఎండు మిరపకాయలు,ఇంగువ ,చింతపండు గుజ్జు వేసి, బాగా ఉడకనివ్వాలి.
7.చింతపండు గుజ్జు , ఉడికి చిక్కబడుతుంది. (వేసుకున్న గుజ్జు కన్నా 1/3 వంతు తక్కువ అవుతుంది) చింతపండు రంగు కూడా కొంచం నల్లగా మారుతుంది.
8.ఇలా చిక్కగా ఐన గుజ్జు లో, పసుపు, తగినంత ఉప్పు, బెల్లము వేసి 5 నిముషాలు ఉడకనిచ్చి, స్టవ్ ఆఫ్ చేయాలి.
9.బేసన్ (పెద్ద గిన్నె)లో ఉడికిన పొడి పొడి రవను వేసి,2 స్పూన్స్ నూనె వేసి, బాగా కలపాలి.
10.తరువాత ఉడికించిన గుజ్జు, పక్కన పెట్టుకున్న తిరగమాత గింజలు, నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసి, బాగా కలపాలి.
11.ఉప్పు తక్కువ అయితే కలుపుకోవాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే రవ పులిహోర/పిండి పులిహోర రెడి

