Website TemplatesJoomla TemplatesWeb Hosting

కాప్సికం పులావ్ (Vegetable Pulav)

 

capsicum pulav

కావలసిన పధార్థాలు:

బాస్మతి రైస్ ----3 కప్స్
కాప్సికం---3
ఉల్లిపాయ ----1
కారెట్ ----1
ఉర్లగడ్డ ----1
బేన్స్ ----- 10
పచ్చి బఠానీలు ---1/4 కప్
కొత్తిమెర --- 1/4 కట్ట
చెక్క ---- 1"
లవంగాలు ---- 3
జావెత్రి ---2
బేలివ్స్  (బిరియాని ఆకులు )----3
జీర పొడి ---- 1 స్పూన్
దనియ పొడి -----1 1/2 స్పూన్
గరం మసాల --- 1/2 స్పూన్
అల్లం,వెల్లుల్లి పేస్ట్ ---2 స్పూన్స్
నూనె-----1 స్పూన్
నెయ్యి---- 1స్పూన్

విధానము:

1.బాస్మతి  బియ్యం   బాగ  కడిగి  30 నిముషాలు నానపెట్టాలి.
2.కూరలు అన్నీ, చిన్నగా తరిగి వుంచుకోవాలి.
3.బానలి పెట్టి నూనె,నెయ్యి వేసి వేడి అయ్యాక ,అందులో చెక్క ,లవంగాలు,యాలక్కులు ,జావెత్రి, బేలివ్స్ (బిరియాని ఆకు )వేయాలి.
4.అందులోకి తరిగిన ఉల్లిపాయలు  ,అల్లం , వెల్లుల్లి  పెస్ట్ వేసి ఎర్రగా వేయించాలి.
5.తరిగిన కూరలు కూడ వేసి 5 నిముషాలు వేయించాలి.
6.తరువాత అందులోకి  కొత్తిమిర , దనియా పొడి , జీర పొడి , గరం మసాల, వేసి 2 నిముషాలు వేయించాలి.
7.అందులోకి , కడిగిన  బాస్మతి బియ్యం  వేసి 1 నిముషం వేయించాలి.
8.తరువాత  కుకర్  పెట్టి  , వేయించిన  బాస్మతి బియ్యం+కూరలు వేసి నీరు వేయాలి .
 (బాస్మతి బియ్యం కు 1 కప్ కు 1 1/2 నీరు వేయాలి.1 కి 2 నీరు వేస్తే అన్నము ముద్దగా అవుతుంది)
9.తరువాత తగినంత ఉప్పు వేయాలి.
10.చివరి లో పులావ్  పైన , 1 స్పూన్  కుంకుమ పువ్వు నీరు  వేస్తే , ఎంతో రుచిగా ,కలర్ ఫుల్ గా ఉంటుంది.

నోరూరించే కాప్సికం పులావ్ రెడీ.ఈ అన్నము  రైతా తో తింటే చాల బాగుంటుంది. 

capsicum  pulav 

 

Add your comment

Your name:
Your website:
Comment:

  ganesh