పుదీన పులావ్ (Mint Pulav)
|
|
కావలసిన పధార్థాలు: బాస్మతి బియ్యం---3 కప్స్ |
విధానము:
1.బాస్మతి రైస్ బాగా కడిగి అర గంట నాన పెట్టాలి.
2.బానలి లో నూనె, నెయ్యి వేసి, వేడి అయ్యాక లవంగాలు, ఏలకులు, దాల్చిన్ చెక్క ముక్కలు, బిర్యాని ఆకులు వేయాలి.
3.తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి.
4..తరువాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఒక నిముషం వేగ నిచ్చి, ఆలుగడ్డ ముక్కలు, కారెట్ ముక్కలు ,పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి.
5.మిక్సీ జార్ లో, పుదీన, కొత్తిమీర, పచ్చి మిర్చి, సోంపు, పచ్చి కొబ్బెర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
6.తరువాత గ్రైండ్ చేసిన కొత్తిమీర -పుదీన పేస్ట్ వేయాలి.
7.తరువాత బాస్మతి బియ్యం బాగా కడిగి, వేయించిన మసాలలో వేసి 2 నిముషాలు వేయించాలి.
8. తరువాత 3కప్స్ బాస్మతి బియ్యానికి, 41/2 కప్ నీరు వేసి మూత పెట్టి ఉడికించాలి.
( కూరలలో నీరు ఉన్నందున మనం 1/2 కప్ తగ్గించి 4 కప్స్ నీరు వేసాము. కాబట్టి అన్నం ముద్దగా కాకుండా పొడిగా ఉంటుంది.)
ఎంతో రుచిగా ఉండే పుదీన పులావ్ రెడి. దీన్ని రైతా తో తింటే చాలా బాగుంటుంది.

