గోంగూర పులిహోర(Gongura/Sorrel leaves Pulihora)
|
|
కావలసిన పధార్థాలు: బియ్యం –2 కప్స్ |
విధానము:
1. బియ్యంలో 4 గ్లాసులు నీరు వేసి,2 విసిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి.
2. తరువాత పొడి పొడి గా ఐన అన్నం లో పసుపు వేసి చల్లార పెట్టాలి.

3. బాణలి లో 2 స్పూన్స్ నూనె వేసి, ఉద్దిపప్పు, శనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎర్ర మిరపకాయలు, నువ్వులు , మెంతులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

4. తరువాత అదే బాణలి లో 2 స్పూన్స్ నూనె వేసి గోంగూర వేసి దోరగా వేయించాలి.

5. తరువాత వేయించిన గింజలు, గోంగూర గ్రైండ్ చేసుకోవాలి.(మెత్తగా కాకుండా బరకగా).

6. తరువాత బానలి లో 2 స్పూన్స్ నూనె వేసి, ఉద్దిపప్పు, ఆవాలు, శనగ పప్పు, జీలకర్ర, వేరు శనగ విత్తనాలు, జీడిపప్పు, ఇంగువ, పెద్దగా తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు, ఎండు మిరపకాయలు,ఇంగువ వేయాలి

7. తరువాత తిరగమాత దోరగా వేగినాక పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

8. తరువాత పసుపు వేసి చల్లార్చిన అన్నం లో వేయించిన తిరగమాత వేయాలి.

9. తరువాత తయారు చేసుకొన్న గోంగూర మిశ్రమం వేయాలి.

10.తరువాత ఉప్పు వేసి మిశ్రమం అంతా కలిసేలా కలపాలి.

ఎంతో రుచిగా ఉండే గోంగూర పులిహోర రెడి. ఈ అన్నం లో వడియాలు, అప్పడాలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది

