రవ పకోడి (Rava Pakodi)
|
కావలసిన పదార్థాలు: బొంబాయి రవ -------1 కప్ |
విధానము:
1.బొంబాయి రవ , పెరుగులో వేసి బాగా కలిపి అరగంట నానపెట్టాలి.
2.ఉల్లిపాయలు , అల్లం , పచ్చి మిర్చి , కరివేపాకు చిన్నగా తరుక్కోవాలి.
3.తరువాత ఒక గిన్నె తీసుకొని అందులోకి పెరుగులో నాన పెట్టిన బొంబాయి రవ,తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు , పచ్చి మిర్చి, అల్లం, కరివేపాకు , ఇంగువ , ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
4.తరువాత బానలి లో నూనె పెట్టి ,కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని , చిన్న చిన్న పకోడి లా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే రవ పకోడి రెడి.
